AP News: హైకోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్.. ఈ నెల 20కి విచారణ వాయిదా

|

Aug 14, 2024 | 4:37 PM

గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు అక్కడ ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వాళ్లంతా వల్లభనేని వంశీ అనుచరులేనన్నది ప్రధాన ఆరోపణ.

AP News: హైకోర్టులో వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్.. ఈ నెల 20కి విచారణ వాయిదా
Vamsi Vallabhaneni
Follow us on

గతేడాది ఫిబ్రవరి 20న గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది. కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు అక్కడ ఉన్న వాహనాలను కూడా ధ్వంసం చేశారు. దాడికి పాల్పడిన వాళ్లంతా వల్లభనేని వంశీ అనుచరులేనన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఎక్కువమంది వంశీ పేరు చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే కోసం వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. దాంతో, ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు వంశీ. ఈ పిటిషన్‌పై వాదోపవాదనలు జరిగాయ్‌. కక్షపూరితంగా కేసు పెట్టారని వంశీ తరపు లాయర్ వాదిస్తే.. దాడి వెనుక వంశీ ప్రమేయం ఉందంటూ వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపు న్యాయవాది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు వంశీపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..