ఏపీ పంచాయతీ పోరులో రచ్చ.. పోలింగ్ ఏజెంట్లపై దాడి.. ఒకరికి తీవ్ర గాయాలు

|

Feb 21, 2021 | 5:14 PM

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెదురుమదురు సంఘటనలు ప్రశాంతంగా ముగిసింది. ఇటు, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండంలోని ముట్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఏపీ పంచాయతీ పోరులో రచ్చ.. పోలింగ్ ఏజెంట్లపై దాడి.. ఒకరికి తీవ్ర గాయాలు
Follow us on

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల సందర్భంగా చెదురుమదురు సంఘటనలు ప్రశాంతంగా ముగిసింది. ఇటు, గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండంలోని ముట్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సర్పంచ్‌ అభ్యర్థులుగా ఒకే వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. అయితే, ఏకపక్షంగా ఓట్లు వేయించుకుంటున్నారనే ఆరోపణలతో మరో వర్గం వారు 5, 7 పోలింగ్‌ కేంద్రాల్లోకి చొరబడి బూత్‌ ఏజెంట్లపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో గాయపడిన బాబూరావు అనే వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రహరీగోడ దూకి దాడి చేస్తున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారని బాధితులు ఆరోపించారు.

దాడిలో ఓ వ్యక్తి గాయపడగా మరో ఏజెంట్‌ను పెట్టుకునేందుకు ఉన్నతాధికారులు అనుమతించారు. తమ ఏజెంట్లపై దాడి చేసిన వారిని శిక్షించాలంటూ మరోవర్గం ఆందోళనకు దిగింది. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో గుంటూరు అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. న్యాయం చేస్తామని బాధితులకు హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Read Also…  AP Panchayat Elections 2021 results live: ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కొనసాగుతున్న కౌంటింగ్