తిరుమలలో భక్తులకు భోజనాలు అలా అందించాల్సిందే.. హోటళ్ళపై టీటీడీ ఈవో ప్రత్యేక దృష్టి..

| Edited By: Srikar T

Jun 29, 2024 | 5:56 PM

తిరుమలలోని హోటల్స్‌‎పై టిటిడి దృష్టి సారించింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వచ్చే భక్తులకు తక్కువ ధరలకే రుచికరమైన ఆహారాన్ని నాణ్యతతో అందించాలన్నారు ఈఓ శ్యామల రావు. భక్తులకు మరింత పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు.

తిరుమలలో భక్తులకు భోజనాలు అలా అందించాల్సిందే.. హోటళ్ళపై టీటీడీ ఈవో ప్రత్యేక దృష్టి..
Ttd Eo
Follow us on

తిరుమలలోని హోటల్స్‌‎పై టిటిడి దృష్టి సారించింది. శ్రీవారి దర్శనం కోసం తిరుమల కొండకు వచ్చే భక్తులకు తక్కువ ధరలకే రుచికరమైన ఆహారాన్ని నాణ్యతతో అందించాలన్నారు ఈఓ శ్యామల రావు. భక్తులకు మరింత పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడమే టీటీడీ లక్ష్యమన్నారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జేఈవో వీరబ్రహ్మంతో కలిసి తిరుమలలోని పెద్ద హోటళ్ళు, జనతా హోటళ్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సరసమైన ధరలకు.. నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖ హోటళ్ల జాబితా రూపొందించడానికి ఇండియన్ క్యులినరీ ఇన్‌స్టిట్యూట్ అధ్యాపకులు చలేశ్వరరావు, తాజ్ హోటల్స్ జీఎం చౌదరి సూచనలను ఆహ్వానించినట్లు చెప్పారు.

తిరుమల హోటల్స్‎పై ఎస్టేట్స్ స్పెషల్ ఆఫీసర్ మల్లిఖార్జున పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తిరుమలలోని హోటళ్ల గురించి వివరించారు. భక్తులకు హోటల్స్ అందిస్తున్న ఆహారం, పరిశుభ్రతతోపాటు నాణ్యత, ధరలపై ఆరా తీశారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని తనిఖీ చేశారు టీటీడీ ఈవో. యాత్రికులకు అందిస్తున్న రుచికరమైన వంటకాలను స్వయంగా పరిశీలించారు. టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాల గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సూచనల మేరకు అన్నప్రసాదాలను మరింత రుచిగా అందించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..