ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..

| Edited By: Srikar T

Jul 15, 2024 | 9:55 PM

అల్లూరి జిల్లా ఏజెన్సీలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులో గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రమాదకరంగా మారాయి. రహదారి లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు గడ్డల నుంచి ప్రయాణం సాగిస్తున్నారు గిరిజనులు. ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ నుంచి ఈదుకుంటూ.. ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఒడ్డు దాటుతున్నారు.

ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం.. పట్టు తప్పితే అంతే సంగతులు..
Alluri Agency
Follow us on

అల్లూరి జిల్లా ఏజెన్సీలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులో గడ్డలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రమాదకరంగా మారాయి. రహదారి లేకపోవడంతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు గడ్డల నుంచి ప్రయాణం సాగిస్తున్నారు గిరిజనులు. ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డ నుంచి ఈదుకుంటూ.. ఒకరికొకరు సహకారం అందించుకుంటూ ఒడ్డు దాటుతున్నారు.

ముంచంగిపుట్టు మండలం కొడ్ ఫుట్ వద్ద గెడ్డ పొంగి ప్రవహిస్తుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాణం అరచేతిలో పెట్టుకొని అష్టకష్టాలు పడి గెడ్డలు దాటుతున్నారు గ్రామస్థులు. ఈ గెడ్డ ఆనుకొని కొడపుట్, కేందుగూడ, మూవులపుట్ పీవిటీజీ గ్రామాల్లో 150 కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి చికిత్స నిమిత్తం పోవాలన్నా, నిత్యావసర వస్తువులకు, వ్యవసాయ పనులకు వెళ్లాలన్నా ఈ గెడ్డ దాటవలసిందే. అలా చేయకపోతే వాళ్లకు పూట గడవదు.

అయితే.. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న గడ్డ వాగుల ప్రయాణం ఒక్కోసారి పట్టు తప్పితే ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. ఆ ప్రాంతంలో బిడ్జి నిర్మాణం చేయాలని గిరిజనులు ఏళ్లతరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టర్‎కు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేదని వాపోతున్నారు స్థానిక సర్పంచ్ త్రినాధ్. ప్రజల కష్టాలు గుర్తించి పీఎం జన్ మన్ స్కీమ్ ద్వారా బిడ్జి మంజూరు చేసి నిర్మాణం చేయాలని అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..