హోరాహోరీ పోరులో ఆళ్ళగడ్డ

| Edited By:

Mar 23, 2019 | 2:27 PM

ఆళ్లగడ్డ పేరు వినగానే ప్రత్యర్థులైన భూమా, గంగుల వర్గాలు గుర్తుకు వస్తాయి. ఫ్యాక్షన్‌ కక్షలు, ముఠా తగాదాలు ఇప్పుడు లేకున్నా.. ఈ వర్గాల నడుమ రాజకీయ వైరం.. ఆధిపత్య పోరు మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. మూడో తరం కూడా ఎన్నికల సంగ్రామంలోకి దిగడంతో ఈ దఫా ఇక్కడ హోరాహోరీ సమరం తథ్యంగా కనిపిస్తోంది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 1985 నుంచి 2014 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో భూమా, గంగుల కుటుంబాలే బరిలోకి దిగాయి. 1967 […]

హోరాహోరీ పోరులో ఆళ్ళగడ్డ
Follow us on

ఆళ్లగడ్డ పేరు వినగానే ప్రత్యర్థులైన భూమా, గంగుల వర్గాలు గుర్తుకు వస్తాయి. ఫ్యాక్షన్‌ కక్షలు, ముఠా తగాదాలు ఇప్పుడు లేకున్నా.. ఈ వర్గాల నడుమ రాజకీయ వైరం.. ఆధిపత్య పోరు మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. మూడో తరం కూడా ఎన్నికల సంగ్రామంలోకి దిగడంతో ఈ దఫా ఇక్కడ హోరాహోరీ సమరం తథ్యంగా కనిపిస్తోంది.

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 1985 నుంచి 2014 వరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో భూమా, గంగుల కుటుంబాలే బరిలోకి దిగాయి. 1967 నుంచి ఇక్కడ 17 సార్లు ఎన్నికలు జరుగగా (ఇందులో నాలుగు ఉప ఎన్నికలు).. రెండు సార్లు మాజీ మంత్రి ఎస్‌వీ సుబ్బారెడ్డి, 5 దఫాలు గంగుల కుటుంబ సభ్యులు గెలిచారు. అత్యధికంగా భూమా కుటుంబం (వీరశేఖరరెడ్డి, నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి, అఖిలప్రియ) 9 సార్లు గెలిచింది.

భూమా నాగిరెడ్డి దంపతుల కుమార్తె అయిన అఖిలప్రియ టీడీపీ తరపున పోటీచేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ అభ్యర్థి శోభానాగిరెడ్డి రోడ్డుప్రమాదంలో మరణించారు. మరణానంతరం జరిగిన ఎన్నికల్లో ఆమె గెలుపొందారు కూడా. తర్వాతి ఉప ఎన్నిక సందర్భంగా అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత తండ్రి నాగిరెడ్డితోపాటు టీడీపీలో చేరారు. గంగుల ప్రభాకర్‌రెడ్డి కుమారుడు బ్రిజేంద్రారెడ్డి వైసీపీ తరపున బరిలో నిలిచారు. ‘నువ్వా.. నేనా’ అని రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. నియోజకవర్గంలో బలిజలు, బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరు మొదటి నుంచి భూమా కుటుంబానికి మద్దతుగా ఉన్నారు. ఎస్సీలు, మైనారిటీలు కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు.