B.R. Naidu: ఇది వాళ్లపనే.. వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!

తనపై వస్తున్న ఆరోపణలపై టీటీడీ చైర్మన్ BR నాయుడు వివరణ ఇచ్చారు. డీప్ ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వ్యక్తిగతంగా తనను అప్రతిష్టపాలు చేయడంతో పాటు టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని.. వైసీపీలోని కొందరు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కామెంట్ చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు.

B.R. Naidu: ఇది వాళ్లపనే.. వైరల్‌ వీడియోపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్లారిటీ!
Ttd Chairman B.r. Naidu Refutes Deepfake Allegation

Updated on: Mar 01, 2026 | 2:02 PM

సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్పందించారు. నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తనను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. AI సాంకేతికతను వాడుకుని తన రూపం అనుకరించే విధంగా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారన్నారు.

ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనదని.. దీనిని కావాలనే వక్రీకరించి ప్రచారం చేస్తున్నారన్నారు. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం అని చెప్పుకొచ్చారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని. వైసీపీ కి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిపై తాను చట్ట ప్రకారం ముందుకెళ్తానని.తనపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదని స్పష్టం చేశారు.

మరిన్ని అంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us