Andhra Pradesh: పండుగ పూట దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి.. శ్మశానవాటికకు తీసుకెళ్లి.. ఆపై

|

Sep 02, 2022 | 7:18 AM

ఊరు ఊరంతా వినాయక చవితి ఉత్సవాల్లో మునిగిపోయింది. వినాయక మండపాలు, విగ్రహాలతో గ్రామమంతా సందడిగా మారింది. ఇదే అదనుగా భావించిన ముగ్గురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న...

Andhra Pradesh: పండుగ పూట దారుణం.. బాలికను కిడ్నాప్ చేసి.. శ్మశానవాటికకు తీసుకెళ్లి.. ఆపై
Girl Punishment
Follow us on

ఊరు ఊరంతా వినాయక చవితి ఉత్సవాల్లో మునిగిపోయింది. వినాయక మండపాలు, విగ్రహాలతో గ్రామమంతా సందడిగా మారింది. ఇదే అదనుగా భావించిన ముగ్గురు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఇంటి వద్ద ఒంటరిగా ఉన్న బాలికను కిడ్నాప్ చేశారు. శ్మశాన వాటికకు తీసుకువెళ్లి తీవ్రంగా కొట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడి, ఇంటి వద్ద పడేసి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులు గమనించి చికిత్స కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్నారు. తిరుపతి జిల్లాలోని కేవీబీ పురం మండలానికి చెందిన ఓ బాలిక తొమ్మిదో తరగతి చదవుతోంది. గ్రామంలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను ప్రతిష్టించారు. పండుగ సందర్భంగా తన తల్లితో కలిసి గ్రామంలో ఏర్పాటు చేసిన విగ్రహాలను చూసేందుకు వెళ్లింది. రాత్రి 10 గంటలకు బాలికకు కడుపునొప్పి వచ్చింది. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఆమె బాలికను ఇంటివద్ద దిగబెట్టి మళ్లీ బయటకు వెళ్లి రాత్రి 11 గంటలకు ఇంటికి తరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చిన ఆమెకు కూతురు కనిపించలేదు. దీంతో తీవ్ర భయాందోళనకు లోనై సమీపంలో వెతికింది. అయినా లాభం లేకపోవడంతో గ్రామస్థుల సహాయంతో చుట్టుపక్కలా గాలించారు. ఈ క్రమంలో బాత్ రూమ్ వద్ద బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించారు.

ఆమెను ఏం జరిగిందని అడగగా రాత్రి తాను స్నానానికి వెళ్లిన సమయంలో సెల్వం, గుణ, అశోక్‌ అనే ముగ్గురు యువకులు తనను కిడ్నాప్ చేసినట్లు తెలిపింది. శ్మశాన వాటికకు తీసుకెళ్లి కర్రతో కొట్టారని, కిందపడిపోవడంతో గుణ, అశోక్‌లు భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారని వివరించింది. కాగా.. సెల్వం తనపై అత్యాచారం చేశాడని భాదితురాలు కన్నీటిపర్యంతమైంది. ఘటన జరిగిన తర్వాత తనను ఇంటి వద్ద దింపేసి వెళ్లారని చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే.. కేసు వివరాలు చెప్పేందుకు పోలీసులు సుముఖత చూపించకపోవడంతో పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు్న్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..