పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలను బెంబేలెత్తిస్తున్న పెద్దపులి.. పాదముద్రలును గుర్తించిన అధికారులు

|

Dec 27, 2020 | 8:54 PM

పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను బెంబేలెత్తిస్తుంది. జిల్లాలోని వేలేరుపాడు అడవుల్లో పెద్దపులి తిరుగుతుండటం కలకలం రేపుతోంది.

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలను బెంబేలెత్తిస్తున్న పెద్దపులి.. పాదముద్రలును గుర్తించిన అధికారులు
Follow us on

పశ్చిమగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజలను బెంబేలెత్తిస్తుంది. జిల్లాలోని వేలేరుపాడు అడవుల్లో పెద్దపులి తిరుగుతుండటం కలకలం రేపుతోంది. కొద్దిరోజులక్రితం తెలంగాణలోని అశ్వారావుపేట మండలంలోని కవాడిగుండ్ల అటవీప్రాంతంలో పెద్దపులి దాడి చేసి ఒక ఆవును, దూడని చంపేసింది. ఆ తర్వాత వేలేరుపాడు సమాపంలో ఉన్న కొన్ని గ్రామాల్లో పెద్దపులి సంచరించడంతో ఆ గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు గ్రామస్థులు సమాచారం అందించడంతో తనిఖీలు నిర్వహించిన వారికి పులి పాదముద్రలు లభించాయి. దాంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.