ఉత్తర కోస్తాకు వర్షసూచన

| Edited By:

Apr 16, 2019 | 7:26 AM

వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాది నుంచి పయనిస్తున్న వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో తూర్పు భారతంలో వర్షాలకు అనుకూల వాతావరణం నెలకొంది. దీని ప్రభావంతో ఒడిశాకు ఆనుకుని వున్న ఉత్తర కోస్తాలో కూడా అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో ఉరుములు, ఈదురుగాలులతో, రాయలసీమలో ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలో […]

ఉత్తర కోస్తాకు వర్షసూచన
Follow us on

వాతావరణ మార్పుల ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాది నుంచి పయనిస్తున్న వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌ ప్రభావంతో తూర్పు భారతంలో వర్షాలకు అనుకూల వాతావరణం నెలకొంది. దీని ప్రభావంతో ఒడిశాకు ఆనుకుని వున్న ఉత్తర కోస్తాలో కూడా అక్కడక్కడా ఉరుములతో వర్షాలు కురిశాయి. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో ఉరుములు, ఈదురుగాలులతో, రాయలసీమలో ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తరువాత రెండు రోజులపాటు ఉత్తర కోస్తాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌తోపాటు ఎండ తీవ్రతతో వాతావరణ అనిశ్చితి ఏర్పడి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా రాయలసీమ, కోస్తాల్లో ఎండ తీవ్రత కొనసాగుతోంది. అనంతపురంలో 42.6 డిగ్రీలు నమోదైంది.