బ్రహ్మోత్సవాలు: గరుడ వాహనంపై శ్రీవారు

| Edited By:

Oct 05, 2019 | 5:40 AM

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఐదో రోజు అశేష భక్త జనసందోహం జయజయ ధ్వానాల మధ్య గరుడ వాహనంపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో విహరించారు. గరుడ సేవ సందర్భంగా నాలుగు మాఢవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిక్కిరిశాయి. గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగింది. భక్తుల కోలాటాలు, వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ గరుడ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు శ‌నివారం హ‌నుమంత వాహ‌నం, స్వ‌ర్ణ‌ర‌థం, రాత్రికి గ‌జ‌వాహనంపై శ్రీవారు విహరించనున్నారు. గరుడ వాహనంపై […]

బ్రహ్మోత్సవాలు: గరుడ వాహనంపై శ్రీవారు
Follow us on

శ్రీవారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ఐదో రోజు అశేష భక్త జనసందోహం జయజయ ధ్వానాల మధ్య గరుడ వాహనంపై శ్రీవారు తిరుమాడ వీధుల్లో విహరించారు. గరుడ సేవ సందర్భంగా నాలుగు మాఢవీధుల్లోని గ్యాలరీలు భక్తులతో కిక్కిరిశాయి. గోవింద నామస్మరణతో తిరుమల మార్మోగింది. భక్తుల కోలాటాలు, వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ గరుడ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆరో రోజు శ‌నివారం హ‌నుమంత వాహ‌నం, స్వ‌ర్ణ‌ర‌థం, రాత్రికి గ‌జ‌వాహనంపై శ్రీవారు విహరించనున్నారు.

గరుడ వాహనంపై ఉన్న స్వామివారిని దర్శించడం ద్వారా సర్పదోష శాంతి, దివ్యమైన జ్ఞానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడ వాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గం ప్రాప్తించి, ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి, బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ విశిష్టత సంతరించుకుంది.