ఎవరైనా సరే.. ఆంక్షలు తప్పితే.. కఠిన చర్యలే: డీఎస్పీ

| Edited By:

Apr 16, 2019 | 5:16 PM

పోలింగ్ రోజు సత్తెనపల్లిలో జరిగిన పరిణామాలు తీవ్ర సంచలనం రేపాయి. ఆ గొడవలు, ధర్నాలు, ఆందోళనలపై దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. రాజపాలెం మండలం ఇనిమెట్లలో జరిగిన దాడిపై మరింత రాజకీయ దుమారం రేగింది. సత్తెనపల్లిలో మే 23 వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ధర్నాలు, దిష్టిబొమ్మలు దగ్ధం, నిరాహార దీక్షలకు అనుమతులు లేవన్నారు పోలీసులు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్పీ మురళీకృష్ణ. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి […]

ఎవరైనా సరే.. ఆంక్షలు తప్పితే.. కఠిన చర్యలే: డీఎస్పీ
Follow us on

పోలింగ్ రోజు సత్తెనపల్లిలో జరిగిన పరిణామాలు తీవ్ర సంచలనం రేపాయి. ఆ గొడవలు, ధర్నాలు, ఆందోళనలపై దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. రాజపాలెం మండలం ఇనిమెట్లలో జరిగిన దాడిపై మరింత రాజకీయ దుమారం రేగింది. సత్తెనపల్లిలో మే 23 వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, ధర్నాలు, దిష్టిబొమ్మలు దగ్ధం, నిరాహార దీక్షలకు అనుమతులు లేవన్నారు పోలీసులు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘించితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు డీఎస్పీ మురళీకృష్ణ. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 248 బైండోవర్‌ కేసులు, 36 ఎన్నికల కేసులు నమోదు చేసి, రూ. 92,26,250ల నగదును సీజ్ చేశామన్నారు డీఎస్పీ.