త్వరలో ఏపీలో 25 కొత్త జిల్లాలు

| Edited By:

Jun 25, 2019 | 8:22 PM

ఏపీలో పారదర్శక పాలనే లక్ష్యమంటున్న సీఎం జగన్ అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదంటున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 15 కల్లా కొత్త జిల్లాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 25 జిల్లాల్లో ఒకటి, రెండు మినహా మిగిలిన వాటన్నింటికీ పార్లమెంట్ నియోజక […]

త్వరలో ఏపీలో 25 కొత్త జిల్లాలు
Follow us on

ఏపీలో పారదర్శక పాలనే లక్ష్యమంటున్న సీఎం జగన్ అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నా సహించేది లేదంటున్నారు. పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 25కు పెంచాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జూలై 15 కల్లా కొత్త జిల్లాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 25 జిల్లాల్లో ఒకటి, రెండు మినహా మిగిలిన వాటన్నింటికీ పార్లమెంట్ నియోజక వర్గాల పేర్లు యధాతథంగా ఉంచే అవకాశం ఉంది. సెప్టెంబర్ 15 కల్లా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసి.. జెడ్పీ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ నాటి కల్లా స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలన్న ప్రయత్నంలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.