Tenali: ఏమిటిది..? పుట్టిన దూడను చూసి ఆశ్చర్యపోయిన తెనాలి జనం..

ఏపీలో జరిగిన వింత ఘటన తాలూకా వివరాలు ఇవి. తెనాలి మండలం ఎరుకలపూడిలోని ఆయుర్వేద వైద్యశాల ఆశ్రమంలో రెండు తలలు, ఎనిమిది కాళ్లతో వింత దూడ జన్మించింది. పశువు ప్రసవ సమయంలో సుమారు ఐదు గంటలపాటు శ్రమించిన పశువైద్యులు దూడను బయటకు తీశారు.

Tenali: ఏమిటిది..? పుట్టిన దూడను చూసి ఆశ్చర్యపోయిన తెనాలి జనం..
Rare Calf

Updated on: Aug 15, 2026 | 12:01 PM

సాధారణంగా దూడ పుడితే గేదె యజమానులు, చుట్టుపక్కల వారు ఆసక్తిగా చూస్తారు. కానీ తెనాలి మండలం ఎరుకలపూడిలో మాత్రం ఓ వింత దూడ జననం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రెండు తలలు, ఎనిమిది కాళ్లతో దూడ జన్మించడంతో ఈ వార్త క్షణాల్లో పరిసర ప్రాంతాలకు వ్యాపించింది.

ఎరుకలపూడిలోని ఆయుర్వేద వైద్యశాల ఆశ్రమంలో ఓ పశువు ప్రసవ వేదనకు గురికావడంతో నిర్వాహకులు వెంటనే పశువైద్యులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న వైద్యులు దాదాపు ఐదు గంటలపాటు శ్రమించి ప్రసవాన్ని పూర్తి చేయించారు. అయితే గర్భాశయం నుంచి బయటకు వచ్చిన దూడను చూసి వారు సైతం ఆశ్చర్యపోయారు. రెండు తలలు, ఎనిమిది కాళ్లతో వింత ఆకృతిలో దూడ జన్మించింది. ఈ విషయం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో వైద్యశాల ఆశ్రమానికి చేరుకుని వింత దూడను ఆసక్తిగా తిలకించారు. దూడను చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు రావడంతో అక్కడ కొంతసేపు సందడి నెలకొంది.

ఇలాంటి జననాలు చాలా అరుదుగా జరుగుతాయని పశుసంవర్ధక శాఖ వైద్యులు తెలిపారు. పిండం గర్భంలో అభివృద్ధి చెందే సమయంలో ఏర్పడే అరుదైన అసాధారణతల కారణంగా ఇలాంటి శారీరక మార్పులతో జంతువులు జన్మించే అవకాశం ఉంటుందని వివరించారు. రెండు తలలు.. ఎనిమిది కాళ్లతో జన్మించిన ఈ వింత దూడ ప్రస్తుతం ఎరుకలపూడిలో హాట్‌టాపిక్‌గా మారింది.

వీడియో దిగువన చూడండి..

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us