తమ్ముడు జగన్‌తో కలిసి ముందుకు వెళ్తాం : సీఎం కేసీఆర్

|

Aug 12, 2019 | 7:48 PM

చిత్తూరు: తమ్ముడు ఏపీ సీఎం జగన్‌తో కలిసి ముందుకు వెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా నివాసంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు భోజనం చేశారు. అనంతరం నగరి నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు బయల్దేరారు. హైదరాబాద్‌కు బయల్దేరే ముందు రోజా నివాసంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉందని సీఎం కసీఆర్ అభిప్రాయ పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు పట్టుదలతో పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారని […]

తమ్ముడు జగన్‌తో కలిసి ముందుకు వెళ్తాం : సీఎం కేసీఆర్
CM KCR About Jagan
Follow us on

చిత్తూరు: తమ్ముడు ఏపీ సీఎం జగన్‌తో కలిసి ముందుకు వెళ్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా నివాసంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులు భోజనం చేశారు. అనంతరం నగరి నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు బయల్దేరారు.

హైదరాబాద్‌కు బయల్దేరే ముందు రోజా నివాసంలో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ప్రాంతానికి గోదావరి జలాలు రావాల్సిన అవసరం ఉందని సీఎం కసీఆర్ అభిప్రాయ పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు పట్టుదలతో పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారని అన్నారు. రాయలసీమ ప్రజల బాధలు తెలిసిన నాయకుడు వైఎస్ జగన్ అని కొనియాడారు. ఇప్పటికే తాను, జగన్ కలిసి గోదావరి జలాలపై చర్చలు జరిపామని కేసీఆర్ అన్నారు. కృష్ణా గోదావరి జలాలు వృధాగా సముద్రం పాలు అవుతున్నాయని, వాటినలా వదిలేయకుండా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అన్నారు. గత 60-70 ఏళ్ల  తెలుగువాళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా, సరికొత్త అధ్యాయాన్ని తాను జగన్ కలిసి లిఖించబోతున్నాం అన్నారు. ఈ నిర్ణయం కొందరికి జీర్ణంకాక, అజీర్తి కావొచ్చని అన్నారు. ప్రజల దీవెన ఉంటే రాయలసీమను రతనాల సీమగా మార్చడానికి, దేవుడిచ్చిన సకలశక్తులను ఒడ్డుతామని సీఎం కేసీఆర్ అన్నారు.