ఇసుక సమస్యపై మంగళగిరిలో నారా లోకేష్ ధర్నా

| Edited By:

Aug 30, 2019 | 10:31 AM

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్‌ వద్ద మూసేసిన అన్న క్యాంటీన్‌ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గృహనిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను లోకేశ్‌కు వివరించారు. పేదల రాజ్యాన్ని పులివెందుల భోజ్యంగా మార్చారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాలో ప్లకార్డులు […]

ఇసుక సమస్యపై మంగళగిరిలో నారా లోకేష్ ధర్నా
Follow us on

ఏపీలో ఇసుక కొరతను నిరసిస్తూ టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపడుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేపట్టిన ధర్నాలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. మంగళగిరి పాత బస్టాండ్‌ వద్ద మూసేసిన అన్న క్యాంటీన్‌ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు గృహనిర్మాణ కార్మికులు ఇసుక కొరతతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను లోకేశ్‌కు వివరించారు. పేదల రాజ్యాన్ని పులివెందుల భోజ్యంగా మార్చారంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు.

కాగా, ఇప్పటికే పలు జిల్లాల్లో టీడీపీ నేతల్ని ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడిని మచిలీపట్నంలో రాత్రే హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లోపల్ని సమర్ధించుకునేందుకే ఇలా ఆందోళనలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు.