Chandrababu: ఆ గ్రామాలన్నింటినీ కలిపి జిల్లా చేస్తాం.. వరద బాధితులకు చంద్రబాబు హామీ

|

Jul 29, 2022 | 9:08 AM

Chandrababu: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే..

Chandrababu: ఆ గ్రామాలన్నింటినీ కలిపి జిల్లా చేస్తాం.. వరద బాధితులకు చంద్రబాబు హామీ
Chandrababu Naidu
Follow us on

Chandrababu: గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూనే.. ముంపు బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము అధికారంలోకి వస్తే పోలవరం ముంపు ప్రాంతాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ముంపు ప్రాంతాల కోసమే జిల్లా ఏర్పాటు చేస్తామన్నారు.

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు వేలేరుపాడులో బాధితులతో మాట్లాడారు. జనం కష్టాల్లో ఉండే సీఎం జగన్‌ గాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. కొంతమందికే 2 వేలు ఇచ్చారు. వాటితో జనం కష్టాలు తీరతాయా అని ప్రశ్నించారు. పోలవరం కట్టలేనని సీఎం చేతులెత్తేశాడని ఆరోపించారు. 4 కాంటూర్‌ లెవల్‌ 41.15 వరకు మాత్రమే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తానంటే తగదని.. కాంటూర్‌ లెవల్‌ 45.75 వరకు ప్యాకేజీ ఇచ్చి తీరాలని డిమాండ్‌ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు.

ఏలూరులోని బొండ్లబోరు, శివకాశీపురం గ్రామంలో చంద్రబాబు పర్యటించారు. పోలవరం ముంపు బాధితులకు రూ.2వేల కోట్ల పరిహారమైతే ఇస్తానని.. మొత్తం తన వల్ల కాదని జగన్‌ చెప్పడం బాధ్యతారాహిత్యమన్నారు. గోదావరిలో కొట్టుకుపోయే పశువుల్ని కూడా సీఎం కాపాడలేదని మండిపడ్డారు.

ఇదిలాఉండగా.. భద్రాచలం పరిధిలోనూ చంద్రబాబు పర్యటించారు. బూర్గంపాడులో పడవ ప్రమాదంలో చనిపోయిన వెంకట నర్సయ్య కుటుంబానికి లక్ష రూపాయల చెక్ అందించారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చానని, ఎక్కడ వరద వచ్చినా అప్రమత్తంగా ఉన్నామని అన్నారు చంద్రబాబు. 1986 లో వరద వస్తే ఇక్కడ గ్రామ గ్రామాన తిరిగానని నాటి రోజులను గుర్తు చేశారు చంద్రబాబు. తాను ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు కరకట్ట నిర్మాణం చేసి, భద్రాచలం ముంపునకు గురికాకుండా కాపాడుకున్నామని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని టిడిపి కోరుకుంటుందన్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు చంద్రబాబు. అనంతరం చంద్రబాబు.. భద్రాద్రి కొత్తగూడెంలోని సారపాక చేరుకున్నారు. అక్కడ ప్రసంగించిన ఆయన.. నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల బాట పట్టించింది తానేనని అన్నారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అవసరం అని, మళ్లీ తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. అక్కడి నుంచి భద్రాచలం చేరుకున్న చంద్రబాబు.. రాత్రి బస్సులోనే బస చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..