TDP Leader: వాస్తవాలు ప్రకటిస్తారని అనుకున్నాం.. ఆయన చెప్పినవన్నీ అసత్యాలే..: కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత

|

Jan 15, 2021 | 8:50 PM

TDP Leader: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడుల విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, టీడీపీ నేత జవహార్ మండిపడ్డారు.

TDP Leader: వాస్తవాలు ప్రకటిస్తారని అనుకున్నాం.. ఆయన చెప్పినవన్నీ అసత్యాలే..: కీలక వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత
Follow us on

TDP Leader: ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై దాడుల విషయంలో డీజీపీ గౌతమ్ సవాంగ్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి, టీడీపీ నేత జవహార్ మండిపడ్డారు. ఆలయాలపై దాడుల విషయంలో డీజీపీ వాస్తవాలు ప్రకటిస్తారని అనుకున్నాం కానీ.. అసత్యాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. శుక్రవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. డీజీపీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ మంత్రివర్గంలో మంత్రిగా డీజీపీ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై విగ్రహాలు ధ్వంసం చేశారని కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా.. ప్రతిపక్షాలపై నెపం వేస్తున్నారని జవహార్ ధ్వజమెత్తారు. తిరుమల శ్రీవారి వద్ద అన్యమత ప్రచారం చేసిన, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, మంత్రిపై ఎందుకు కేసులు పెట్టలేదని డీజీపీని ఆయన నిలదీశారు. అరచ్చకులను కొరడాతో కొట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసుల తీరును ఆయన ఎండగట్టారు. హిందూమతం పట్ల, విగ్రహాల ధ్వంసం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నానిపై కేసు పెట్టాలని పోలీసులను జవహార్ డిమాండ్ చేశారు.

కాగా, ఇవాళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన డీజీపీ గౌతమ్ సవాంగ్.. ఆలయాల ధ్వంసంపై కొందరు పథకం ప్రకారమే అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రకటించారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆలయాలపై దాడులకు సంబంధించి 9 కేసుల్లో పలువురు రాజకీయ నేతల ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశామని అన్నారు. అరెస్టు అయిన వారిలో టీడీపీకి చెందిన 13మంది, బీజేపీకి చెందిన ఇద్దరు ఉన్నట్లు డీజీపీ చెప్పారు.

Also read:

West Bengal: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి మరో దారి లేదు.. కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు..

Farmers Protest: కేంద్రం, రైతుల మధ్య ముగిసిన తొమ్మిదో దఫా చర్చలు.. మరోసారి అసంతృప్తి.. ఈ నెల 19న నెక్స్ట్ సమావేశం…