Chandrababu: జగన్ ఒక అపరిచితుడు.. రివర్స్ నిర్ణయాలతో అంధకారం ఏపీ జనం..

|

Apr 18, 2022 | 6:49 PM

జగన్‌(YS Jagan) ఎంత బలహీనుడో కేబినెట్ విస్తరణతోనే అర్థమైందని కామెంట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu). జగన్ ఏదో చేస్తారని భావించిన సొంతవర్గం కూడా ఇప్పుడు..

Chandrababu: జగన్ ఒక అపరిచితుడు.. రివర్స్ నిర్ణయాలతో అంధకారం ఏపీ జనం..
Chandrababu Naidu
Follow us on

జగన్‌(YS Jagan) ఎంత బలహీనుడో కేబినెట్ విస్తరణతోనే అర్థమైందని కామెంట్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu). పార్టీ ప్లానింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనతో ఏపీలోని అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం నెలకొందని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఒక అపరిచితుడని.. ఆయన రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం కూడా రివర్స్‌లో వెళ్తోందని విమర్శించారు. నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనం వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాణి హస్తం ఉందన్నారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంతవర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనలో ఉందన్నారు. జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరుగుతోందని విమర్శించారు చంద్రబాబు. వైసీపీలో ఉన్న డొల్లతనం, అసంతృప్తి మంత్రివర్గ విస్తరణ సందర్భంగా బయటపడిందని సెటైర్లు వేశారు.

బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోందని ఎద్దేవ చేశారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న విజయసాయిరెడ్డి.. ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది కూడా దోపిడీ చేసేందుకేనని ఆరోపనలు గుప్పించారు.

ఒకటో తేదీనే ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టానని చెప్పిన సీఎం జగన్.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పింఛన్‌ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని  ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి: Stock Market: రూ. 2.56 లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరి.. భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్‌ షేర్లు..

Metro Trains: మెట్రో బాట పట్టిన భాగ్యనగర వాసులు.. ఆర్టీసీ చార్జీల మోతతో పెరిగిన రద్దీ..

Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..