AP Schools: ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచో తెలుసా.?

|

Apr 02, 2024 | 12:55 PM

అసలే పరీక్షాకాలం.. ఆపై బాబోయ్ అనిపించే ఎండలు.. ఇలాంటి తరుణంలో విద్యార్ధులకు కాస్త ఉపశమనాన్ని ఇస్తూ.. ఏపీ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 స్కూల్స్ అన్నింటికీ సెలవులు ప్రారంభం కానుండగా.. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

AP Schools: ఏపీలో స్కూళ్లకు వేసవి సెలవులు.. ఎప్పటినుంచో తెలుసా.?
Ap Schools
Follow us on

అసలే పరీక్షాకాలం.. ఆపై బాబోయ్ అనిపించే ఎండలు.. ఇలాంటి తరుణంలో విద్యార్ధులకు కాస్త ఉపశమనాన్ని ఇస్తూ.. ఏపీ ప్రభుత్వం ఇటీవలే రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించేసింది. ఏప్రిల్ 24 స్కూల్స్ అన్నింటికీ సెలవులు ప్రారంభం కానుండగా.. 2024-25 విద్యా సంవత్సరానికి గానూ జూన్ 13న తిరిగి పాఠశాలలు పున: ప్రారంభమవుతాయి.

ఈ సెలవుల లెక్క చూసుకుంటే.. సుమారు 50 రోజుల పాటు స్కూళ్లకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిందన్న మాట. ఇక ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 18 నుంచి రాష్టమంతటా ఉన్న స్కూల్స్‌కు ఒంటిపూట బడులు నిర్వహిస్తోంది ఏపీ సర్కార్. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు తరగతులు జరుగుతున్నాయి. కాగా, ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ 23 నాటికి పరీక్షలను పూర్తి చేసి..  ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనుంది రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ.