నాసిరకంగా “అక్షయపాత్ర” మధ్యాహ్న భోజన పథకం.. విద్యార్థుల ధర్నా..

| Edited By: Srinu

Jul 10, 2019 | 3:54 PM

ప్రకాశం, ఓంగోలు జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలంటూ సీఐటీయూ, ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. గత కొద్ది రోజుల క్రితం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసి.. అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు భోజనం అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై విద్యార్థి సంఘాలు, మధ్యాహ్న భోజన వర్కర్లు మండిపడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వరాదని ఆందోళనకు దిగారు. అక్షయపాత్ర ద్వారా పెట్టే భోజనాలు చాలా నాసిరకంగా […]

నాసిరకంగా అక్షయపాత్ర మధ్యాహ్న భోజన పథకం.. విద్యార్థుల ధర్నా..
Follow us on

ప్రకాశం, ఓంగోలు జిల్లాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలంటూ సీఐటీయూ, ఎస్ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ధర్నా చేపట్టారు. గత కొద్ది రోజుల క్రితం మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసి.. అక్షయపాత్ర ద్వారా విద్యార్థులకు భోజనం అందించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిపై విద్యార్థి సంఘాలు, మధ్యాహ్న భోజన వర్కర్లు మండిపడుతున్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వరాదని ఆందోళనకు దిగారు. అక్షయపాత్ర ద్వారా పెట్టే భోజనాలు చాలా నాసిరకంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని కోరుతున్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.