Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.

ఏపీ ప్రజలకు అలర్ట్. వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కొనసాగుతుండగా.. ఇప్పుడు వర్షాలతో కాస్త ఉపశమనం లభించింది. అటు నైరుతి రుతుపవనాలపై కూడా కీలక ప్రకటన చేశారు. రానున్న రోజుల్లో మరింతగా విస్తరించనున్నాయి.

Southwest Monsoon: నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి.. రాబోయే మూడ్రోజుల్లో.. వాతావరణశాఖ కీలక అప్డేట్.
Rains

Updated on: May 27, 2026 | 2:42 PM

దక్షిణ బీహార్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌ల మీదుగా ఉత్తర బీహార్ నుండి దక్షిణ తెలంగాణ వరకు విస్తరించి ఉంది. ఇక ఉత్తర తమిళనాడు తీరం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఇకపశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సగటు సముద్ర మట్టానికి 3.1, 7.6 కిలోమీటర్ల మధ్య తూర్పు మధ్య  ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో  ఏపీలో వర్షాలు పడే అవకాశముంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో నేడు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గరిస్టముగా గంటకు 50 -60 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.

ఏపీకి వర్షసూచన జారీ

రేపు, ఎల్లుండి ఉత్తర కాస్తా, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది. ఇక రాయలసీమలో ఈరోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఎల్లుండి కూడా రాయలసీమలో వర్షాలకు ఛాన్స్ ఉంది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 3 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో పెద్దగా మార్పు ఉండదు. ఆ తర్వాతి రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు లో 2-3℃ తగ్గే అవకాశముంది.

నైరుతి రుతుపవనాలపై అప్డేట్

నైరుతి రుతుపవనాలు  మే 27వ తేదీన నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్ ప్రాంతంలోని కొన్ని భాగాలకు, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలకు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలకు మరింతగా విస్తరించాయి. రాబోయే 2-3 రోజులలో నైరుతి రుతుపవనాలు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, లక్షద్వీప్ ప్రాంతానికి, నైరుతి, తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మిగిలిన భాగాలకు విస్తరించనున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలకు మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తన వెదర్ బులిటెన్‌లో పేర్కొంది.

Loading...
Unable to load recommendations.
Follow Us