శింగనమలలో సెంటిమెంట్ రిపీట్…

| Edited By:

May 24, 2019 | 4:42 PM

అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందుతారో ఆ పార్టీ అభ్యర్థి అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా నడుస్తోంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. గత 7 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించడంతో రాష్ట్రంలో వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. దీంతో శింగనమల సెంటిమెంట్‌ మరోసారి రుజువు […]

శింగనమలలో సెంటిమెంట్ రిపీట్...
Follow us on

అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో ఏ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపొందుతారో ఆ పార్టీ అభ్యర్థి అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా నడుస్తోంది. ఈ ఏడాది కూడా అదే జరిగింది. గత 7 సార్లు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందితే ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి విజయం సాధించడంతో రాష్ట్రంలో వైసీపీ అధికారం చేజిక్కించుకుంది. దీంతో శింగనమల సెంటిమెంట్‌ మరోసారి రుజువు అయ్యింది.