ఇంద్రకీలాద్రి : జీన్స్ వేసుకుంటే అంతరాలయంలోకి నో ఎంట్రీ…!

| Edited By:

Jan 14, 2020 | 10:47 AM

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో జనవరి 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని, జీన్స్ లాంటి మోడరన్ దుస్తుల్లో వస్తే అంతరాలయ దర్శనం అనుమతి ఉండదని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు తేల్చి చెప్పారు. ఇక పండుగ సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాల్లో ఉంటోన్న వృద్ధులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు, […]

ఇంద్రకీలాద్రి : జీన్స్ వేసుకుంటే అంతరాలయంలోకి నో ఎంట్రీ...!
Follow us on

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో జనవరి 14 నుంచి 16 వరకు సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఇందుకోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాగా అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులు సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలని, జీన్స్ లాంటి మోడరన్ దుస్తుల్లో వస్తే అంతరాలయ దర్శనం అనుమతి ఉండదని దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు తేల్చి చెప్పారు. ఇక పండుగ సమయంలో విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వృద్ధాశ్రమాల్లో ఉంటోన్న వృద్ధులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించడంతో పాటు, చీరలు ఇవ్వనున్నారు.

దుర్గమ్మను  అంతరాలయం నుంచి దర్శించుకోవాలనుకునేవారికి టికెట్ రూ.300 గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే ఏర్పాట్లు కూడా చేశారు.  మరోవైపు ఈ నెల 30న శ్రీపంచమి నేపథ్యంలో అమ్మవారు సరస్వతి దేవీగా దర్శనమివ్వనున్నారు. ఆ‌రోజు స్టూడెంట్స్‌కు ఉచిత దర్శనం కల్పిచడంతో పాటు, 100 మందికి స్కాలర్‌షిప్‌లు ఇచ్చే ఏర్పాట్లు చేస్తోన్నారు. ఇక అమ్మవారి పులిహోర ప్రసాదం వెలను రూ.5 నుంచి రూ.10కి పెంచే ఆలోచనలు చేస్తోన్నట్లు ఈవో వెల్లడించారు.