
ఏపీలోని దివ్యాంగులకు కూటమి సర్కార్ మరో శుభవార్త అందించింది. మార్చి 2026 నుండి సదరం సర్టిఫికేట్లు జారీ చేయనుంది. ఆన్‌లైన్‌లోనే స్లాట్ల బుకింగ్‌తో పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షల తర్వాత డిజిటల్ సర్టిఫికేట్ జారీ చేశారు. ఆన్‌లైన్ ద్వారానే ప్లాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఇందుకోసం కొత్త సాఫ్ట్‌వేర్ తీసుకొచ్చారు. మార్చి 25వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో స్లాట్ల బుకింగ్ మొదలుకానుండగా.. మార్చి 30 నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం అర్హులైన వారికి ఆన్‌లైన్‌లోనే డిజిటల్ సర్టిఫికేట్ జారీ చేయనున్నారు. ప్రతి సోమ, మంగళవారాల్లో స్లాట్ బుకింగ్ ఉంటుంది. మొత్తం 21 రకాల వైకల్యాలకు సర్టిఫికెట్లు జారీ చేయనున్నారు.
గ్రామ,వార్డు సచివాలయాల్లోనే సదరం స్లాట్ల బుకింగ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కొత్త సాఫ్ట్‌వేర్ ద్వారా వేగంగా అసెస్‌మెంట్ చేయనున్నారు. సదరం స్లాట్ బుకింగ్ కోసం 21 డిసేబిలిటీలను వివరించారు.
1. Leprosy Cured person
వివరణ: కుష్టు వ్యాధి పూర్తిగా నయమైన వాళ్లు. చేతులు లేదా కాళ్లు దెబ్బతిని ఉన్నప్పుడు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
2. Locomotor Disability
వివరణ: కాళ్లు లేదా చేతులు సరిగా కదలకపోవడం, నడవడంలో సమస్య. పోలియో, అక్సిడెంట్ వల్ల చేతులు కాళ్లు విరిగినప్పుడు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
3. Dwarfism
వివరణ: ఎత్తు చాలా తక్కువగా ఉండటం (మరుగుజ్జు). ఇది పుట్టుకతోనే వచ్చే సమస్య. నాలుగు అడుగులు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్నవాళ్లు మాత్రమే ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
4. Cerebral palsy
వివరణ: పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగ్గా ఉండకపోవడం. చేతులు, కాళ్లు వణకడం లేదా బలం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
5. Muscular Dystrophy
వివరణ: కండరాలు నెమ్మదిగా బలం కోల్పోయే వ్యాధి. నడవడం, చేతులు ఎత్తడం ఇబ్బందిగా ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
6. Chronic Neurological conditions
వివరణ: చాలా కాలం నుంచి నాడీ సమస్యలు (మెదడు లేదా నరాలు దెబ్బతినడం). నడవలేకపోవడం, చేతులు కాళ్లు కదల్చలేని వాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
7. Multiple Sclerosis
వివరణ: నరాలు దెబ్బతిని శరీరం బలం కోల్పోయే వ్యాధి. చూడడం, నడవడం, మాట్లాడడం సమస్యలు ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
8.Parkinson’s disease
వివరణ: వణకు వచ్చి, చేతులు కాళ్లు కదలడం కష్టం అయ్యే వ్యాధి. చాలా నెమ్మదిగా నడుస్తూ ఇబ్బంది పడేవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
9. Hearing impairment
వివరణ: చెవులతో సరిగా వినలేకపోవడం. కొంచెం వినడం లేదా పూర్తిగా వినకపోవడం (చెవుడు ఉన్నవాళ్లు) ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
10. Mental illness
వివరణ: మనసు సమస్యలు (డిప్రెషన్, భయం, మనసు గందరగోళం). రోజువారీ జీవితం సరిగా నడవకపోవడం లేదా ఇబ్బందులు ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
11. Intellectual Disability
వివరణ:(మంద బుద్ది / బుద్ది మాంధ్యం) తెలివి సాధారణం కంటే తక్కువగా ఉండటం. చదువు, మాట్లాడటం, రోజువారీ పనులు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నవాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
12. Blindness
వివరణ: కంటి చూపు పూర్తిగా లేని వాళ్లు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
3. Low-vision
వివరణ: కళ్లతో కొంచెం మాత్రమే చూడగలగడం. దూరం లేదా దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
14. Hemophilia
వివరణ: రక్తం సరిగా గడ్డ కట్టని వ్యాధి ఉన్నవాళ్లు (చిన్న గాయం అయినా ఎక్కువ రక్తం పోవడం) ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
15. Thalassemia
వివరణ: శరీరంలో రక్తం తక్కువ అయ్యే వ్యాధి ఉన్నవాళ్లు (ఎప్పుడూ రక్తం ఇవ్వాల్సి ఉంటుంది) ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
16. Sickle cell disease
వివరణ: రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువ అయ్యే వ్యాధి. చాలా నొప్పి మరియు అలసట వస్తుంది – ఇటువంటి లక్షణాలు ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
17. Acid Attack Victims
వివరణ: ఆసిడ్ దాడి వల్ల ముఖం, శరీరం దెబ్బతినడం. ఆసిడ్ దాడి వల్ల చర్మం, కళ్లు, చేతులు సమస్యలు వచ్చిన వారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
18. Speech & Language Disability
వివరణ: మాట్లాడటం లేదా భాష అర్థం కాకపోవడం. మాటలు స్పష్టంగా రాకపోవడం వంటి సమస్య ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
9. Specific Learning Disability
వివరణ: చదవడం రాకపోవడం, రాయడం రాకపోవడం, లెక్కలు నేర్చుకోవడంలో మాత్రమే ప్రత్యేక సమస్య. తెలివి సాధారణంగా ఉంటుంది కానీ చదువు కష్టంగా ఉంటుంది – ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
20. Autism spectrum disorder
వివరణ: ఇతరులతో కలవడం, మాట్లాడడం, ప్రవర్తనలో సమస్య. ఒంటరిగా ఉండాలని అనిపించడం, కొన్ని పనులు రిపీట్ చేయడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.
21. Multiple disabilities
వివరణ: ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవారు (ఉదా: కళ్లు + చెవులు లేదా కదలిక + మనసు). ఈ డిసేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి.