YSRCP: రాజోలు వైసీపీలో రాజకీయ రగడ.. పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి

|

Jun 22, 2022 | 3:13 PM

కోనసీమలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ వైసీపీలో చాలాకాలం నుంచి వర్గ విభేదాలు ఉన్నా, అవి ఇప్పుడు ముదిరి పాకాన పడినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో..

YSRCP: రాజోలు వైసీపీలో రాజకీయ రగడ.. పార్టీకి రాజీనామా చేసిన రాష్ట్ర కార్యదర్శి
Rudraraju Venkataramaraju
Follow us on

రాజోలు రాజకీయం రంజుగా సాగుతోంది. కోనసీమలో ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అధికార పార్టీ వైసీపీలో చాలాకాలం నుంచి వర్గ విభేదాలు ఉన్నా, అవి ఇప్పుడు ముదిరి పాకాన పడినట్టుగా కనిపిస్తున్నాయి. ఆ పార్టీలో మరోసారి ముసలం మొదలైంది. దీంతో కొత్తగా వచ్చినవారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మరో వర్గం గుర్రుగా ఉంటోంది. కొత్తవారి పెత్తనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు రాజీనామాలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ సారి ఆ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకటరామరాజు రాజీనామా చేశారు. కేవలం వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి మాత్రమే కాకుండా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.

తన అనుచరులతో రాజీనామా లేఖలను పార్టీ కార్యాలయంకు పపించారు. రాజీనామా ఎందుకు చేస్తున్నారో కూడా వెల్లడించారు. ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్నవారిని పక్కన పెట్టి కొత్తగా జనసేన నుంచి పార్టీలోకి వచ్చినవారికి ప్రముఖ్యత పెరుగుతోందిని ఆరోపించారు. వైసీపీ కోసం ఎన్నికలలో పని చేసిన వారిని పక్కన పెట్టి జనసేన నుంచి వచ్చిన వారికి పెద్దపీట వేయడంపై రుద్రరాజు మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వ మూడేళ్ల పాలన పైనా వెంకటరామరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటరామరాజుతో పాటు 1000 మంది కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే తెలుగుదేశం నుంచి ఆహ్వానం వచ్చిందన్నారు. కార్యకర్తలతో కలిసి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు వెంకటరామరాజు.

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..