రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. ఆసుపత్రిలో బెడ్‌పై నుంచి కిందపడిన నిందితుడు హేమంత్‌!

రాప్తాడు ఘటనలో పోలీసుల కాల్పుల్లో గాయపడి అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న హేమంత్ సోమవారం పడకపై నుంచి కిందపడిపోయాడు. వైద్యులు పరీక్షించగా బీపీ, పల్స్ తగ్గడంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తూ నలుగురు వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు..

రాప్తాడు ఘటనలో కీలక పరిణామం.. ఆసుపత్రిలో బెడ్‌పై నుంచి కిందపడిన నిందితుడు హేమంత్‌!
Rapthadu Incident Accused Hemant

Updated on: Nov 10, 2026 | 8:16 AM

రాప్తాడు, నవంబర్ 10: అనంతపురం జిల్లాలోని రాప్తాడు ఘటనలో నిందితుడిగా ఉన్న హేమంత్‌కు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అతడు అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో సోమవారం అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని పడకపై నుంచి హేమంత్ కిందపడిపోవడంతో అక్కడ కొద్దిసేపు కలకలం నెలకొంది. హేమంత్ పడకపై నుంచి కిందపడటాన్ని గమనించిన ఆసుపత్రి సిబ్బంది, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు వెంటనే స్పందించారు. అతడిని తిరిగి పడకపైకి చేర్చారు. అనంతరం ఈ విషయాన్ని ఆసుపత్రిలో ఉన్న వైద్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న వైద్యులు హేమంత్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

వైద్య పరీక్షల్లో హేమంత్‌కు రక్తపోటు (బీపీ), పల్స్ రేటు తగ్గినట్లు గుర్తించారు. అంతేకాకుండా శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధారించారు. దీంతో వైద్యులు వెంటనే అప్రమత్తమై అవసరమైన చికిత్స ప్రారంభించారు. ప్రస్తుతం అతడికి ఆక్సిజన్ అందిస్తూ వైద్య పర్యవేక్షణలో ఉంచారు. హేమంత్ ఆరోగ్య పరిస్థితిని నలుగురు వైద్యులతో కూడిన ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని అనంతపురం సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌కు ఇప్పటికే చికిత్స అందిస్తుండగా, తాజాగా చోటుచేసుకున్న అస్వస్థతతో వైద్యులు మరింత అప్రమత్తమయ్యారు. అతడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us