ఇల్లు కట్టాలంటే ఇంకుడు గుంత ఉండాల్సిందే మరి..

| Edited By:

Aug 13, 2019 | 11:44 PM

అడుగంటిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకోడానికి ఇంకుడుగుంతల ఆవశ్యకతపై ఎంతోమంది నిపుణులు ఎన్నోసార్లు చెప్పారు. ఇటీవల మద్రాస్‌లో నీటిఎద్దడి ఎంతగా జనాన్ని ఇబ్బందిపెట్టిందో ఇప్పట్లో మర్చిపోలేం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకుడుగుంతల ఏర్పాటును అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించింది. తాజాగా ఏపీలో ఇకపై ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంటి ఆవరణలో ఖచ్చితంగా ఇంకుడు గుంత ఉండి తీరాల్సిందే అని నియమం పెట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇకపై కొత్తగా గృహనిర్మాణం చేసుకునే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. […]

ఇల్లు కట్టాలంటే ఇంకుడు గుంత ఉండాల్సిందే మరి..
Follow us on

అడుగంటిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకోడానికి ఇంకుడుగుంతల ఆవశ్యకతపై ఎంతోమంది నిపుణులు ఎన్నోసార్లు చెప్పారు. ఇటీవల మద్రాస్‌లో నీటిఎద్దడి ఎంతగా జనాన్ని ఇబ్బందిపెట్టిందో ఇప్పట్లో మర్చిపోలేం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంకుడుగుంతల ఏర్పాటును అప్పటి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహించింది.

తాజాగా ఏపీలో ఇకపై ఇల్లు నిర్మించుకోవాలంటే ఇంటి ఆవరణలో ఖచ్చితంగా ఇంకుడు గుంత ఉండి తీరాల్సిందే అని నియమం పెట్టారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇకపై కొత్తగా గృహనిర్మాణం చేసుకునే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. ఇంటి నిర్మాణం చేపట్టే సమయంలో ముందుగా ఇంకుడు గుంత తవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి అధికారులు క్లియరెన్స్ ఇస్తేనే ఆ ఇంటి ప్లాన్‌కు అనుమతి మంజూరు చేయాలని కార్పొరేషన్ భావిస్తోంది. ఈ విధానాన్ని ఖచ్చితంగా పాటించాలని కూడా నిర్ణయించింది.

ఈ నిర్ణయంపై గతంలోనే కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. దాన్ని అమలు చేయడంలో అలసత్వం వహించారు. ప్రస్తుతం ఇంకుడు గుంత నిర్మాణంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది విజయవాడ మున్సిపల్.