Rain: నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు.. దక్షిణ ఆరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం: వాతావరణ శాఖ

|

Jan 09, 2021 | 5:59 AM

Rain:  శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా దక్షిణ ఆరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం నుంచి గుజరాత్‌ వరకు ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ...

Rain: నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు.. దక్షిణ ఆరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం: వాతావరణ శాఖ
Follow us on

Rain:  శ్రీలంక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇంకా దక్షిణ ఆరేబియా సముద్రంలో ఏర్పడిన ఆవర్తనం నుంచి గుజరాత్‌ వరకు ద్రోణి విస్తరించిందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి వరకు పొదలకూరులో 7 సెం.మీ, కోట, నారాయణపేటలో 5 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

అయితే రానున్న24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, సముద్రం నుంచి వీచే గాలుల కారణంగా మేఘాలు ఆవరించడంతో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువ నమోదయ్యాయి.

Jagananna Amma Vodi: ఈనెల 11న రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమం ప్రారంభం.. ఖాతాల్లో జమ కానున్న నగదు