AP News: 108 అంబులెన్స్‌‌ను సీజ్ చేసిన పోలీసులు.. రీజన్ ఇదే…

|

Jul 22, 2024 | 1:04 PM

పోలీస్ స్టేషన్‌లో 108 వాహనం కనిపించింది.. ఏం జరిగిందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. ఎందుకు.. ఏంటో వివరాలు తెలుసుకుందాం పదండి....

AP News: 108 అంబులెన్స్‌‌ను సీజ్ చేసిన పోలీసులు.. రీజన్ ఇదే...
108 Vehile (Representative image)
Follow us on

ఏదైనా ప్రమాదం జరిగినా.. ఎవరైనా ఆపదలో ఉన్నా.. కాల్ చేయగానే… కుయ్.. కుయ్.. కుయ్ అంటూ బాధితులను ఆస్పత్రికి తరలించేందుకు నిమిషాల్లో అక్కడికి చేరుకుంటుంది 108 వాహనం. ఈ ప్రభుత్వ సర్వీసు పూర్తిగా ఉచితం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ అత్యవసర సర్వీసు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. సమయానికి ఆస్పత్రికి చేర్చడం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టాయి ఈ వాహనాలు. అయితే తాజాగా ఏపీలో ఓ 108 వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం చర్చకు దారి తీసింది. ప్రకాశం జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

జులై 10న కొనకనమిట్ల మండలానికి చెందిన 108 వెహికల్.. డయాలసిస్‌ రోగిని హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. అయితే దారిలో కనిగిరి మున్సిపాలిటీలోని టకారిపాలెం దగ్గర రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఈ వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే ఆ 108 వాహనానికి..  ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌తో పాటు ఇన్స్యూరెన్స్ లేకపోవడంతో కనిగిరి పోలీసులు.. ఆ అత్యవసర సర్వీస్ వెహికల్‌ను స్వాధీనం చేసుకుని పీఎస్‌కు తరలించారు. అలాగే వాహన  డ్రైవర్‌పై కేసు ఫైల్ చేశారు. అంతర్గత విచారణ చేయించిన సంబంధిత అధికారులు..  ఉద్యోగం నుంచి తొలగించారు.

ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ రూల్స్ ప్రకారం.. వాహనం ఏదైనా సరే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్, ఇన్స్యరెన్స్ ఉండాలి. అయితే రాష్ట్రవ్యాప్తంగా చాలా వాహనాలకు ఈ ధ్రువపత్రాలు లేవని తెలుస్తోంది.  అంబులెన్సులు కొనుగోలు చేసిన ప్రభుత్వంపైనే.. వాటి ధ్రువపత్రాలను సమకూర్చాల్సిన బాధ్యత ఉందని డ్రైవర్లు చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..