తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు

| Edited By:

Mar 14, 2019 | 11:29 AM

తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. విశాఖ సిటీలో రెండు వేరువేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు 22 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ అండ్ బీ వద్ద సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఈ డబ్బు దొరికింది. విజయభాస్కర్ వద్ద ఉన్న 18 లక్షలు వెంకటేశ్వర ఫిలింస్‌కు చెందినవిగా గుర్తించారు. మరోవైపు అడవి నగరంలో ముగాడ గోపాలరావు నుంచి 4 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి […]

తెలుగు రాష్ట్రాల్లో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో పోలీసుల తనిఖీలు ముమ్మరమయ్యాయి. విశాఖ సిటీలో రెండు వేరువేరు చోట్ల జరిపిన తనిఖీల్లో పోలీసులు 22 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ అండ్ బీ వద్ద సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఈ డబ్బు దొరికింది. విజయభాస్కర్ వద్ద ఉన్న 18 లక్షలు వెంకటేశ్వర ఫిలింస్‌కు చెందినవిగా గుర్తించారు. మరోవైపు అడవి నగరంలో ముగాడ గోపాలరావు నుంచి 4 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించి సరైన పత్రాలు చూపకపోవడంతో ఈ డబ్బును స్వాధీన పర్చుకున్నారు.

ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు బ్యాంక్ ఖాతాలపై దృష్టి సారించామన్నారు ఏపీ అడిషనల్ డీజీపీ రవిశంకర్. ఈసారి పోలింగ్ సందర్భంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించి భద్రతలను పర్యవేక్షిస్తామని వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరిస్తామన్నారు.