Kadapa: ఏఎస్సై ఆత్మహత్య.. చనిపోయేముందు యూనిఫాం తీసి…

|

Jul 03, 2024 | 12:32 PM

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆయన యూనిఫామ్‌ తీసి పక్కనపెట్టి రైలు పట్టాల కిందపడి ఆయన సూసైడ్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. వివరాలు తెలుసుకుందాం పదండి,....

Kadapa: ఏఎస్సై ఆత్మహత్య.. చనిపోయేముందు యూనిఫాం తీసి...
Police Officer Ends Life
Follow us on

ఏం కష్టం వచ్చిందో తెలీదు. ఆ పోలీసు అధికారి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే చనిపోయే సమయంలో కూడా ఆయన తన ఖాకీ డ్రస్‌కు గౌరవాన్ని ఇచ్చారు. యూనిఫామ్ తీసి నీట్‌గా మడిచి పక్కనపెట్టి.. రైలు పట్టాల కింద పడి తనువు చాలించారు. ఈ విషాద ఘటన వైఎస్సార్ కడప జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…  కమలాపురం పోలీసుస్టేషన్‌లో నాగార్జునరెడ్డి అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నారు. నైట్ డ్యూటీ కంప్లీట్ చేసుకుని.. ఎప్పట్లానే బుధవారం ఉదయాన్నే ఇంటికి బయలుదేరారు. దారిలో.. తాటిగొట్ల సమీపంలో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు.  సమాచారం అందటంతో తోటి పోలీసు సిబ్బంది ఒక్కసారిగా షాక్ తిన్నారు. వెంటనే వెళ్లి..  ఘటనాస్థలిని పరిశీలించారు.

ఏఎస్సై నాగార్జునరెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్తం నిమిత్తం గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే… జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ స్థానిక పోలీసులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..