ఇంటూరి చిన్నా అరెస్ట్..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ కార్యకర్తలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 04, 2019 | 8:08 PM

జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కానిస్టేబుల్ పిర్యాదుతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరచగా..కోర్టు రిమాండ్ విధించింది. కాగా గతవారం ఆయన అక్రమంగా తనపై, తన అనుచరలుపై కేసులు పెడుతున్నారని…కనీసం గౌరవం ఇవ్వకుండా వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. ఆ సమయంలో పోలీసులకు, చిన్నా అనుచరులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. కాగా ఇంటూరి చిన్నా ప్రభుత్వ […]

ఇంటూరి చిన్నా అరెస్ట్..ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైసీపీ కార్యకర్తలు
Follow us on

జగ్గయ్యపేట మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఇంటూరి రాజగోపాల్ (చిన్నా)ను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న కానిస్టేబుల్ పిర్యాదుతో ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపరచగా..కోర్టు రిమాండ్ విధించింది. కాగా గతవారం ఆయన అక్రమంగా తనపై, తన అనుచరలుపై కేసులు పెడుతున్నారని…కనీసం గౌరవం ఇవ్వకుండా వేధిస్తున్నారని పోలీస్ స్టేషన్ ఎదుట అర్థనగ్న ప్రదర్శనకు దిగారు. ఆ సమయంలో పోలీసులకు, చిన్నా అనుచరులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

కాగా ఇంటూరి చిన్నా ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానుకు ముఖ్య అనుచరుడిగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఉదయభాను గెలుపు విషయంలో కీలక భూమిక పోషించారు. టీడీపీ హయాంలో అక్రమ కేసులు ఎదుర్కున్నామని..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా సొంత కార్యకర్తల విషయంలో నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని మొదట్నుంచి పార్టీ వెన్నంటి ఉన్నవారు కోరుతున్నారు. అక్రమ కేసులు నుంచి క్యాడర్‌ను కాపాడుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.