AP News: వీళ్లు పెట్రోల్ బంక్‌కు వెళ్తారు.. కానీ పెట్రోల్ కొట్టించుకోరు.. ఎందుకంటే.?

| Edited By: Ravi Kiran

Feb 12, 2024 | 5:27 PM

జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకులే టార్గెట్‌గా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. ఒకట్రెండు కాదు.. ఏకంగా ట్యాంకర్లకు ట్యాంకర్లు పెట్రోల్ బంకుల్లో డీజిల్ దొంగతనం చేస్తారు ఈ ముఠా.

AP News: వీళ్లు పెట్రోల్ బంక్‌కు వెళ్తారు.. కానీ పెట్రోల్ కొట్టించుకోరు.. ఎందుకంటే.?
Petrol Pump
Follow us on

జాతీయ రహదారి పక్కన ఉన్న పెట్రోల్ బంకులే టార్గెట్‌గా డీజిల్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు పోలీసులు. ఒకట్రెండు కాదు.. ఏకంగా ట్యాంకర్లకు ట్యాంకర్లు పెట్రోల్ బంకుల్లో డీజిల్ దొంగతనం చేస్తారు ఈ ముఠా. నేషనల్ హైవేల పక్కన ఉన్న పెట్రోల్ బంకులే వీరి టార్గెట్.. పెట్రోల్ బంకులో సిబ్బంది నిద్రపోతున్న సమయంలో.. వీళ్లు లారీల్లో వచ్చి.. డీజిల్‌ను దొంగతనం చేసేందుకు పెద్దపెద్ద డ్రమ్ములు, క్యాన్లు తీసుకుని వస్తారు. పెట్రోల్ గన్‌తో కాకుండా ఏకంగా భూమిలో ఉన్న ట్యాంక్‌లోకి పైపులు వేసి డీజిల్ తోడేస్తారు.

ఇలా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో పెట్రోల్ బంకుల్లో డీజిల్ దొంగతనాలు చేసే అంతర్రాష్ట్ర గ్యాంగ్‌ను అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. ముఠాలో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నుంచి రెండు లారీలు, రూ. 3.50 లక్షల నగదు, 50 డీజిల్ క్యాన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్‌పై మూడు రాష్ట్రాల్లోనూ పలు కేసులు నమోదయ్యాయి. శివారు ప్రాంతాలు, జాతీయ రహదారుల్లో ఉన్న పెట్రోల్ బంకులే టార్గెట్‌గా ఈ ముఠా డీజిల్ చోరీకి పాల్పడుతుందని.. పెట్రోల్ బంకులో సిబ్బంది నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ ట్యాంకు ఓపెన్ చేసి.. పైపుల ద్వారా డీజిల్ క్యాన్లు, డ్రమ్ముల్లోకి నింపుకుని తమ వెంట తెచ్చుకున్న లారీల్లో పరారవుతారని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు.

అదే విధంగా పెట్రోల్ బంక్ ఆఫీసులపై దాడి చేసి.. అందినకాడికి నగదు దోచుకెళ్లటం జరుగుతుందని పోలీసులు అన్నారు. ఇలా దొంగతనం చేసి డీజిల్‌ను మహారాష్ట్ర తీసుకెళ్లి తక్కువ రేటుకు అమ్ముకుంటారు ఈ ముఠా. పెట్రోల్ బంక్‌లోని ట్యాంకర్ల నుంచి డీజిల్ తోడేందుకు వీరి వద్ద ప్రత్యేకమైన పైపులు, మెషిన్లు కూడా ఉన్నాయి. పెట్రోల్ బంకులోకి వెళ్లి పెట్రోల్, డీజిల్ కావాలంటే కొట్టించుకోవాలి గాని.. ఇలా చాకచక్యంగా కొట్టేయడాన్ని ఎప్పుడూ చూడలేదంటున్నారు పోలీసులు.