ముగ్గురు చిన్నారుల వైద్యం కోసం..

| Edited By: Srinu

Jul 06, 2019 | 7:40 PM

మానసికంగా ఎదుగుదల లేని ముగ్గురు చిన్నారులకు వైద్యం చేయించలేక వారిని కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కర్నూలు జిల్లా దేవ్‌నగర్‌లో నివసించే హుసేన్ బాషా, షేక్ ఆషా దంపతులది మేనరిక వివాహం . దీంతో వీరికి పుట్టిన ముగ్గురు చిన్నారులు మానసిక వైకల్యంతోనే పుట్టారు. అప్పట్నుంచి చిన్నారుల వైద్యం కోసం ఎక్కని హాస్పిటల్ మెట్లు లేవు. ప్రస్తుతం వీరికి వైద్యం చేయించలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పుట్టిన ముగ్గురు ఒకేలాంటి సమస్యతో బాధపడుతుంటే […]

ముగ్గురు చిన్నారుల వైద్యం కోసం..
Follow us on

మానసికంగా ఎదుగుదల లేని ముగ్గురు చిన్నారులకు వైద్యం చేయించలేక వారిని కన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. సాయం చేసే దాతల కోసం ఎదురుచూస్తున్నారు. కర్నూలు జిల్లా దేవ్‌నగర్‌లో నివసించే హుసేన్ బాషా, షేక్ ఆషా దంపతులది మేనరిక వివాహం . దీంతో వీరికి పుట్టిన ముగ్గురు చిన్నారులు మానసిక వైకల్యంతోనే పుట్టారు. అప్పట్నుంచి చిన్నారుల వైద్యం కోసం ఎక్కని హాస్పిటల్ మెట్లు లేవు. ప్రస్తుతం వీరికి వైద్యం చేయించలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. పుట్టిన ముగ్గురు ఒకేలాంటి సమస్యతో బాధపడుతుంటే ఏం చేయాలో తెలియడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

తమకు మేనరిక వివాహం జరిగడం వల్లే ఈ చిన్నారులు ఇలా పుట్టారని చెప్పి ఏడుస్తోంది తల్లి షేక్ ఆషా. ముగ్గురు చిన్నారులకు వైద్యం చేయించాలంటే లక్షలాది రూపాయలు అవసరమవుతున్నాయని, ఇప్పటికే వీరి వైద్యం కోసం రూ.10 లక్షల వరకు ఖర్చుచేశామని .. ఇక ముందు వైద్యం చేయించాలంటే ఎలాగో తమకు అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు తండ్రి హుసేన్ బాషా. ఇప్పటికే పిల్లల వైద్యం కోసం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిన తమకు, మానసిక వైకల్యంతో బాధపడుతున్న తమ ముగ్గురు చిన్నారులకు ఎవరైనా సాయం చేయాలని వేడుకుంటోంది ఈ కుటుంబం.