Papaya: ఆ బొప్పాయి చెట్టుకు ఒకే ఒక్క కాయ.. రాత్రికి రాత్రే సెలెబ్రెటీ.. ఎందుకంటే..

|

Jan 09, 2022 | 11:02 AM

Papaya: ప్రకృతిలో అనేక వింతలు , విశేషాలు.. అనునిత్యం ఎక్కడోచోట ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.  ప్రకృతి ప్రసాదితమైన పళ్ళు, పువ్వులు, కూరగాయలు వింత..

Papaya: ఆ బొప్పాయి చెట్టుకు ఒకే ఒక్క కాయ.. రాత్రికి రాత్రే సెలెబ్రెటీ.. ఎందుకంటే..
Papaya Looks Like Duck
Follow us on

Papaya: ప్రకృతిలో అనేక వింతలు , విశేషాలు.. అనునిత్యం ఎక్కడోచోట ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.  ప్రకృతి ప్రసాదితమైన పళ్ళు, పువ్వులు, కూరగాయలు వింత ఆకారాల్లో కనిపిస్తూ…. సృష్టిలో చిత్ర విచిత్రాలకు ఔరా అనిపిస్తాయి. దుంపల్లో గణేశుడు, కొబ్బరికాయలో దేవుళ్ళు, ఇలా అనేక వింతల గురించి విన్నాం.. వాటి తాలూకా ఫోటోలు చూస్తూనే ఉన్నాం.. తాజాగా బొప్పాయి కాయ.. బాతు ఆకారంలో కనిపిస్తూ.. పలువురు దృష్టిని ఆకర్షిస్తూ.. ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదారి జిల్లా ఆలమూరు మండలంలోని మడికి లంక భూముల్లో ఈ వింత చోటు చేసుకుంది. రామారావు అనే రైతు బొప్పాయి తోట సాగు చేస్తున్నాడు. ఈ బొప్పాయి తోటలో ఓ చెట్టుకు ఓకే ఒక బొప్పాయి కాయ కాసింది. అయితే ఆ కాయతో బొప్పాయి చెట్టు.. రాత్రికి రాత్రి సెలబ్రెటీ అయిపోయింది. ఎందుకంటే ఆ బొప్పాయి కాయ అచ్చం బాతు ఆకారంలో  ఉంది. దీంతో ఈ వింత కాయను చూసేందుకు స్థానికులు బారులు తీరారు.

అయితే ఈ బాతు బొప్పాయి కాయను చూచి ఇష్టపడిన అదే గ్రామానికి చెందిన శేషగిరిరావు అనే వ్యక్తి రెండు వందల రూపాయలకు కొన్నారు. తర్వాత ఈ బాతు బొప్పాయి కాయను మడికి సెంటర్‌కు తీసుకుని వచ్చి పదిమందికి చూపించారు.

అయితే ఈ విషయంపై రాజమండ్రికి చెందిన ఉద్యానవనశాఖ అధికారి (హెచ్‌ఓ) డి.సుధీర్‌ కుమార్‌ స్పందిస్తూ.. బొప్పాయి పువ్వులు వచ్చే సమయంలో పుప్పొడిలో కొన్ని జన్యుపరమైన లోపాలు ఏర్పడి ఉండవచ్చునని చెప్పారు. అందుకనే బొప్పాయి కాయ ఇలా వింత ఆకారంలో ఉందని సుధీర్ కుమార్ చెప్పారు.

Also Read:  పల్లెబాట పడుతున్న నగర వాసులు.. హైదరాబాద్-విజయవాడ హైపై బారులుతీరిన వాహనాలు