ఆగి ఉన్న కారులో 250 కిలోల గంజాయి.. అవాక్కయిన పోలీసులు

| Edited By: Srinu

Jul 06, 2019 | 5:27 PM

గంజాయి రవాణా గుట్టుగా సాగిపోతుంది. అంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాలనుంచి అక్రమార్కులు దీన్ని యుధేచ్చగా తరలించేస్తున్నారు. సుమారు 250 కిలోల గంజాయితో వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో దాన్ని అక్కడే వదిలివేసి పారిపోయారు స్మగ్లర్లు. ఈ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్ధానిక పోలీసుల కథనం ప్రకారం విజయవాడ మీదుగా వస్తున్నఓ కారు ఇటుకల ప్యాక్టరీ వద్దకు రాగానే టైరు పేలిపోవడంతో దాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అయితే గుర్తు తెలియని కారు పార్క్ […]

ఆగి ఉన్న కారులో  250 కిలోల గంజాయి.. అవాక్కయిన పోలీసులు
Follow us on

గంజాయి రవాణా గుట్టుగా సాగిపోతుంది. అంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతాలనుంచి అక్రమార్కులు దీన్ని యుధేచ్చగా తరలించేస్తున్నారు. సుమారు 250 కిలోల గంజాయితో వెళ్తున్న కారు టైరు పేలిపోవడంతో దాన్ని అక్కడే వదిలివేసి పారిపోయారు స్మగ్లర్లు. ఈ ఘటన గుంటూరు జిల్లా యడ్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. స్ధానిక పోలీసుల కథనం ప్రకారం విజయవాడ మీదుగా వస్తున్నఓ కారు ఇటుకల ప్యాక్టరీ వద్దకు రాగానే టైరు పేలిపోవడంతో దాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయారు. అయితే గుర్తు తెలియని కారు పార్క్ చేసి ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో అసలు గుట్టు రట్టయ్యింది.

నిలిచిఉన్న ఆ కారులో సుమారు 250 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ.15 లక్షలు ఉంటుందని తెలిపారు పోలీసులు. నిందితులు ప్రయాణిస్తున్న కారుకు ఉన్న నెంబర్ అసలైంది కాదని, ఇది తమిళనాడుకు చెందిన కారుగా గుర్తించారు. గంజాయిని స్మగ్లింగ్ చేస్తున్నది ఎవరనే దానిపై ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.