Omicron: ఏపీలో విజృంభిస్తున్న ఒమిక్రాన్.. ఒకేరోజు 10 కేసుల నమోదు..

|

Dec 29, 2021 | 3:51 PM

Omicron variant cases: ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్‌ చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఒకేరోజు రాష్ట్రంలో 10 కేసులు నమోదుకావడం కలకలం సృష్టిస్తోంది. మంగళవారం ఒకేరోజు

Omicron: ఏపీలో విజృంభిస్తున్న ఒమిక్రాన్.. ఒకేరోజు 10 కేసుల నమోదు..
Omicron
Follow us on

Omicron variant cases: ఆంధ్రప్రదేశ్‌లో ఒమిక్రాన్‌ చాపకిందనీరులా విస్తరిస్తోంది. ఒకేరోజు రాష్ట్రంలో 10 కేసులు నమోదుకావడం కలకలం సృష్టిస్తోంది. మంగళవారం ఒకేరోజు రాష్ట్రంలో 10 కొత్త ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. దీంతో ఏపీలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 16కి చేరింది. బాధితులందరూ ఐసోలేషన్లో ఆరోగ్యకరంగా ఉన్నట్లు ఏపీ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. బాధితులంతా వేరే దేశాల నుంచి ఏపీకి వచ్చినవారు, అదేవిధంగా వారి సన్నిహితులని ప్రభుత్వం తెలిపింది. వారితో కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేశామని.. అందరికి టెస్టులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.

అమెరికా నుంచి వచ్చిన ఇద్దరికి, యుఏఈ నుంచి వచ్చిన మరో ఇద్దరికి, నైజీరియా, కువైట్, సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక్కొక్కరికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్టు ఏపీ ఆరోగ్యశాఖ డైరక్టర్ తెలిపారు.

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ముగ్గురికి, అనంతపురం, కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు చొప్పున, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా సోకినట్టు వైద్యారోగ్య శాఖ తెలిపింది.

Ap Omicron

Also Read:

KTR: లిక్కర్ ఆఫర్‌పై ట్రోలింగ్.. సోము వీర్రాజు కామెంట్స్‌పై మంత్రి కేటీఆర్‌ సైటర్లు

Balineni Srinivasa Reddy: టీడీపీలో చేరడం చారిత్రక తప్పిదం.. వంగవీటిపై మంత్రి బాలినేని కామెంట్స్