కనిపిస్తే చాలు.. వాటిని కరకరా నమిలేస్తాడు..

| Edited By:

Jul 06, 2019 | 4:31 PM

ఆ గ్రామంలో ఆయనను అంతా వింతగా చూస్తారు. మనిషి మంచోడే.. కానీ అతడికున్న అలవాటు మాత్రం విచిత్రంగా ఉంటుంది. జంతికలు, మురుకులు తిన్నంత ఈజీగా తేళ్లను కరకరా నమిలేస్తాడు. కర్నూలు జిల్లా ఆదోని వద్ద గల లింగద్ద హళ్లి గ్రామస్తుడైన మూకప్ప అనే వృద్దుడి గత ఇరవై ఏళ్లుగా ఇదే పని. ఈ వింత అలవాటుతో జనంలో బాగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు ఇతడు 15 వందలకు పైగా తేళ్లను తినేశాడు. విచిత్రమై ఈ అలవాటుపై […]

కనిపిస్తే చాలు.. వాటిని కరకరా నమిలేస్తాడు..
Follow us on

ఆ గ్రామంలో ఆయనను అంతా వింతగా చూస్తారు. మనిషి మంచోడే.. కానీ అతడికున్న అలవాటు మాత్రం విచిత్రంగా ఉంటుంది. జంతికలు, మురుకులు తిన్నంత ఈజీగా తేళ్లను కరకరా నమిలేస్తాడు. కర్నూలు జిల్లా ఆదోని వద్ద గల లింగద్ద హళ్లి గ్రామస్తుడైన మూకప్ప అనే వృద్దుడి గత ఇరవై ఏళ్లుగా ఇదే పని. ఈ వింత అలవాటుతో జనంలో బాగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు ఇతడు 15 వందలకు పైగా తేళ్లను తినేశాడు. విచిత్రమై ఈ అలవాటుపై మూకప్ప మాట్లాడుతూ.. తనకు ఇరవై ఏళ్లుగా ఈ అలవాటు ఉందని.. ఇలా తేళ్లను తినడం వల్ల.. ఎప్పుడైనా తేలు కుడితే నొప్పి రాదని చెప్పాడు.

ఇదిలా ఉంటే తమ చిన్నతనం నుంచి మూకప్ప తేళ్లను తినడం చూస్తూనే ఉన్నామని గ్రామంలోని యువకులు చెబుతున్నారు. ఎవ్వరూ తనలా ప్రయత్నించవద్దని కూడా చెబుతాడంటున్నారు. మూకప్ప పద్దతి చూసి ..జిహ్వకో రుచి -పుర్రెకో బుద్ధి అంటే ఇదేనేమో అంటున్నారు స్ధానికులు