AP Weather: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అలర్ట్‌.. రానున్న మూడు రోజుల్లో ఈ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు..

|

Jun 02, 2022 | 6:33 PM

AP Weather: రానున్న మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గతకొన్ని రోజుల క్రితం నైరుతి రుతుపవనాల కారణంగా చల్లబడ్డ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కనుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు..

AP Weather: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అలర్ట్‌.. రానున్న మూడు రోజుల్లో ఈ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు..
Heatwave
Follow us on

AP Weather: రానున్న మూడు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గతకొన్ని రోజుల క్రితం నైరుతి రుతుపవనాల కారణంగా చల్లబడ్డ వాతావరణం మళ్లీ ఒక్కసారిగా వేడెక్కనుంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్‌ బారిన పడకుండా ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలని తెలిపారు. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నమోదు కానున్న ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉండనున్నాయి..

శుక్రవారం..

శుక్రవారం అల్లూరిసీతారామరాజు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు,ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు,పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 46°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. అలాగే పార్వతీపురంమన్యం, శ్రీకాకుళం,విజయనగరం, అనకాపల్లి, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములునెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా విశాఖపట్నం, వైఎస్సార్, చిత్తూరు, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి,నంద్యాల, కర్నూలు, జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

శనివారం ఉష్ణోగ్రతలు ఇలా ఉండనున్నాయి..

శనివారం (04-06-2022) రోజు అల్లూరిసీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45°C-47°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే పార్వతీపురంమన్యం, విజయనగరం, కోనసీమ, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 43°C-45°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం,తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య,అనంతపురం, శ్రీసత్యసాయి,నంద్యాల,కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-42°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఆదివారం ఈ ప్రాంతాల్లో..

ఆదివారం (05-06-2022)న అల్లూరిసీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44°C-46°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే విజయనగరం, పార్వతీపురంమన్యం, కోనసీమ, కాకినాడ తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, అన్నమయ్య,అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 40°C-43°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 37°C-39°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వివరించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..