Andhra Pradesh: వృద్ధురాలైనా జనాలను జడుసుకునేలా చేస్తోంది.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..!

|

May 28, 2022 | 9:33 PM

Andhra Pradesh: రోడ్డుపై ఎవరైనా వృద్ధులు వెళ్తుంటే ఎవరూ పెద్దగా లక్ష్యపెట్టరు. వారిని నిర్లక్ష్యంగానే చూస్తారు. కొందరు జాలి చూపుతారు.

Andhra Pradesh: వృద్ధురాలైనా జనాలను జడుసుకునేలా చేస్తోంది.. మ్యాటర్ తెలిస్తే మీటర్ లేచిపోద్ది..!
Old Laday
Follow us on

Andhra Pradesh: రోడ్డుపై ఎవరైనా వృద్ధులు వెళ్తుంటే ఎవరూ పెద్దగా లక్ష్యపెట్టరు. వారిని నిర్లక్ష్యంగానే చూస్తారు. కొందరు జాలి చూపుతారు. మరికొందరు సాయం కూడా చేస్తారు. ఈ పరిస్థితినే ఆ కిలాడీ బామ్మ తనకు ప్లస్‌ పాయింట్‌గా మార్చుకుంది. జనాల అలసత్వం, అమాయకత్వాన్నే తనకు మేజర్ ప్లస్‌గా చేసుకుంది. ఇంకేముంది.. తన వయసుకు, తాను చేసే పనులను ఎవరూ విశ్వసించరనే ధీమాతో రెచ్చిపోయింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 41 చోరీలకు పాల్పడింది. అలాగని ఒకే ప్రాంతంలో కాదండోయ్. ఒక్కో దొంగతనం ఒక్కో జిల్లాలో చేయడం ఆమె స్పెషాలటీ. ఇలా వరుస చోరీలతో జనాలనే హడలెత్తించింది. చివరకు ఎంతో కష్టపడిన తరువాత గానీ.. పోలీసుల చేతికి చిక్కింది ఈ కిలాడీ బామ్మ. అవును, మాయలాడి బామ్మను ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకెళితే.. వరుస గొలుసు చోరీలకు పాల్పడుతున్న సరోజినీ అనే వృద్ధురాలిని ఎన్టీఆర్ కృష్ణా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన సరోజినీ.. దొంగతనాలకు అలవాటు పడింది. ఈ క్రమంలోనే విజయవాడ, తెనాలి, రాజమండ్రి, మైలవరంలో ఈ కిలాడీ బామ్మ చోరీలకు పాల్పడింది. దాదాపు 41కి పైగా దొంగతనం కేసులు ఈమెపై ఉన్నాయి. అయితే, ఇటీవల చెరువుకొమ్ముపాలెం గుడి ప్రతిష్ఠ కార్యక్రమంలో 99 గ్రాముల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది సరోజిని. ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే.. ఆ చోరీకి పాల్పడింది ఓ వృద్ధురాలు. చివరకు ఆమెను కనిపెట్టి చోరీలపై కూపీ లాగగా.. చాంతాడంత లిస్ట్ బయటపడింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 41 చోరీ కేసులు ఆమెపై ఉన్నట్లు గుర్తించారు. తాజాగా చోరీలో కూడా ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.