గల్లా జయదేవ్ విజయం అంత ఈజీ కాదా?

|

May 22, 2019 | 9:40 AM

గల్లా జయదేవ్‌కు మరోసారి గుంటూరు ప్రజల పట్టం కడతారా? బుర్రిపాలెం అల్లుడు మరోసారి పార్లమెంట్‌లో సత్తా చాటుతారా? ..ఏపీ రాజధాని ప్రాంత ఎంపీగా ఆయన మరోసారి చక్రం తిప్పుతారా?.. అయితే అదంతా ఈజీ కాదంటున్నారు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు. గల్లా జయదేవ్‌కు..వైసీపీ అభ్యర్థైన మోదుగులు వేణుగోపాలరెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ నడిచినట్టు సమాచారం. గత ఎన్నికల్లో జయదేవ్‌  69,100 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి, […]

గల్లా జయదేవ్ విజయం అంత ఈజీ కాదా?
Follow us on

గల్లా జయదేవ్‌కు మరోసారి గుంటూరు ప్రజల పట్టం కడతారా? బుర్రిపాలెం అల్లుడు మరోసారి పార్లమెంట్‌లో సత్తా చాటుతారా? ..ఏపీ రాజధాని ప్రాంత ఎంపీగా ఆయన మరోసారి చక్రం తిప్పుతారా?.. అయితే అదంతా ఈజీ కాదంటున్నారు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు. గల్లా జయదేవ్‌కు..వైసీపీ అభ్యర్థైన మోదుగులు వేణుగోపాలరెడ్డికి మధ్య తీవ్రమైన పోటీ నడిచినట్టు సమాచారం. గత ఎన్నికల్లో జయదేవ్‌  69,100 పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు.

గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రత్తిపాడు, తెనాలి, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలు గుంటూరు పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ వేవ్‌తో పాటు ఎప్పడూ పార్టీ వెనుక ఉంటే కమ్మ కమ్యునిటీతో పాటు బీసీ ఓటు బ్యాంకు భారీగా గల్లా జయదేవ్ ఎంపీ కావడానికి సహకరించింది. ఇక జనసేన, బీజేపీ పొత్తు ఎలానూ ఉంది.

కానీ ప్రస్తుత ఎన్నికల్లో జయదేవ్‌ను బాగా ఇబ్బంది పెట్టే విషయం జనసేన బరిలోకి దిగడం. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన  బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. పవన్ ఇమేజ్‌తో పాటు కాపు ఓటు బ్యాంక్, యాదవ సామాజిక సపోర్ట్‌తో  జనసేన అభ్యర్థి భారీగా ఓట్లు చీల్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది పక్కా టీడీపీకి నష్టం చేకూరుస్తందని రాజకీయ నిపుణులు అంటున్నారు. ఈ తీవ్రమైన పోరులో మోదుగుల లేదా జయదేవ్ ఎవరు గెలిచినా కూడా చాలా స్వల్ప మెజారిటీతో బయటపడతారని తెలుస్తోంది.