విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్

|

Jun 12, 2019 | 2:56 PM

 విజయవాడ: సత్యనారాయణపురంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు… గతంలో మూడుసార్లు నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో ఇవాళ ఉదయం సెలవలు అనంతరం మళ్లీ రీ ఓపెన్ చేయడంతో.. విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. గతంలో […]

విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్
Follow us on

 విజయవాడ: సత్యనారాయణపురంలో గుర్తింపు లేకుండా తరగతులు నిర్వహిస్తున్న నారాయణ స్కూల్‌ను బుధవారం జిల్లా విద్యాశాఖ అధికారులు సీజ్‌ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా స్కూల్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు… గతంలో మూడుసార్లు నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో ఇవాళ ఉదయం సెలవలు అనంతరం మళ్లీ రీ ఓపెన్ చేయడంతో.. విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు.

గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. గతంలో సదరు పాఠశాల యాజమాన్యానికి మూడు దఫాలు నోటీసులు ఇవ్వడంతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించినట్టు తెలిపారు.

అర్హులైన పేదలందరిని ‘అమ్మ ఒడి’ ద్వారా ఆదుకుంటామని ఏపీలో అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో పాటు ప్రైవేటు కాలేజీలు, స్కూళ్ల ఫీజుల నియంత్రణకు కమిషన్‌ కూడా వేసింది. తొలి కేబినేట్‌ సమావేశంలోనే విద్యాశాఖలో సంస్కరణలపై ‘రెగ్యులేటరీ కమిషన్‌’ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్.