సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్

| Edited By:

Dec 11, 2019 | 7:48 AM

సీఎం జగన్‌‌పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బ్యాచ్.. తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు తెలుగు సరిగా రాదంటూ.. తనను పప్పూ అంటూ సంబోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పప్పూ అయితే.. సీఎం జగన్ గన్నేరుపప్పా..? అంటూ విమర్శించారు. టీడీపీ హయాంలోనే ఏపీకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు తీసుకొచ్చామని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఉల్లి ధరలకు.. హెరిటేజ్‌కు ముడిపెడుతున్నారని.. […]

సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్
Follow us on

సీఎం జగన్‌‌పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బ్యాచ్.. తనపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తనకు తెలుగు సరిగా రాదంటూ.. తనను పప్పూ అంటూ సంబోధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను పప్పూ అయితే.. సీఎం జగన్ గన్నేరుపప్పా..? అంటూ విమర్శించారు. టీడీపీ హయాంలోనే ఏపీకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు తీసుకొచ్చామని తెలిపారు. పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. ఉల్లి ధరలకు.. హెరిటేజ్‌కు ముడిపెడుతున్నారని.. మంత్రి బుగ్గనకు ఫర్టిలైజర్స్, ఆయిల్ కంపెనీల్లో షేర్లు ఉన్నాయని.. వాటి ధరలు పెరిగితే.. బుగ్గన బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు. ఇక హెరిటేజ్ ఫ్రెష్.. ఎప్పుడో అమ్మేశామని.. ఫ్యూచర్ గ్రూప్ కొనగోలు చేసిందని తెలిపారు.