శ్రీశైలం అడవుల్లో తల్లీకొడుకుల ఆత్మహత్య

|

May 11, 2019 | 2:27 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం సమీప అడవుల్లో విషాదం చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ ఆ వ్యాధి నయం కాదని భావించి మరణమే శరణ్యమనుకుంది. తల్లిలేని లోకంలో తానుండలేనంటూ కుమారుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన చిత్రం మాధవి(34) రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. హైదరాబాద్‌లోనూ చికిత్స తీసుకుంది. వ్యాధి నయం కాదని భావించిన ఆమె చనిపోవాలని […]

శ్రీశైలం అడవుల్లో తల్లీకొడుకుల ఆత్మహత్య
Follow us on

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం సమీప అడవుల్లో విషాదం చోటుచేసుకుంది. క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళ ఆ వ్యాధి నయం కాదని భావించి మరణమే శరణ్యమనుకుంది. తల్లిలేని లోకంలో తానుండలేనంటూ కుమారుడు సైతం ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వారి కుటుంబంలో విషాదం నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన చిత్రం మాధవి(34) రెండేళ్లుగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. హైదరాబాద్‌లోనూ చికిత్స తీసుకుంది. వ్యాధి నయం కాదని భావించిన ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. కొడుకు కార్తీక్‌(18)తో కలిసి ఆరు రోజుల క్రితం శ్రీశైలానికి వచ్చింది. తల్లీ కొడుకులు ఇద్దరూ సాక్షిగణపతి ఆలయ సమీపంలోని అడవుల్లోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు, కొన్ని మాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో శుక్రవారం మృతదేహాలు ఉన్న ప్రదేశాన్ని పోలీసులు గుర్తించారు. శ్రీశైలం ఎస్సై తిమ్మయ్య, రెండో పట్టణ ఎస్సై మహబూబ్‌బాబా మృతదేహాలను పరిశీలించారు.

ఆత్మహత్య చేసుకుని ఆరు రోజుల కావడంతో మృతదేహాలు కుళ్లిపోయాయి. అడవి జంతువులు పీకడంతో కొన్ని శరీర భాగాలు దెబ్బతిన్నట్లు గుర్తించారు. మృతుల ఆధారాలు సేకరించిన పోలీసులు వారి బంధువులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రాజెక్ట్ ఆస్పత్రికి తరలించారు.