More Facts About Loan Apps: తప్పు చేస్తే కన్న కొడుకైనా సరే వదిలిపెట్టేది లేదని నిరూపించాడు ఆ తండ్రి.. రుణయాప్‌ల కేసు విషయంలో..

|

Jan 01, 2021 | 8:23 AM

More Facts About Loan Apps: తప్పు చేస్తే కన్న కొడుకైనా సరే వదిలిపెట్టేది లేదని నిరూపించాడు ఆ పోలీస్ తండ్రి. ఏకంగా పోలీసులకు పట్టించి తన

More Facts About Loan Apps: తప్పు చేస్తే కన్న కొడుకైనా సరే వదిలిపెట్టేది లేదని నిరూపించాడు ఆ తండ్రి.. రుణయాప్‌ల కేసు విషయంలో..
Follow us on

More Facts About Loan Apps: తప్పు చేస్తే కన్న కొడుకైనా సరే వదిలిపెట్టేది లేదని నిరూపించాడు ఆ పోలీస్ తండ్రి. ఏకంగా పోలీసులకు పట్టించి తన నిజాయితీని నిరూపించుకున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన రుణ యాప్‌ల కేసు అందరికి తెలిసిందే. చైనా కంపెనీల వల్ల ఇటీవల ఎందరో అమాయకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని పురోగతి సాధించారు. అయితే చైనా కంపెనీలకు సహకరించింది మన కర్నూల్ జిల్లాకు చెందిన నాగరాజు అనే వ్యక్తి అని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు నాగరాజును అరెస్ట్ చేశారు. అయితే ఈ అరెస్ట్ వెనుక నాగరాజు తండ్రి పాత్ర కూడా ఉంది.

తన కుమారుడు పరోక్షంగా లక్షల మందిని మోసం చేశాడని, ఘరానా నేరానికి పాల్పడ్డాడని ఆ పోలీస్‌కు కొద్దిరోజుల క్రితమే తెలిసింది. ఈ విషయాన్ని నాగరాజుకు చెప్పకుండా కర్నూలుకు రావాలంటూ కోరారు. మూడు రోజుల క్రితం అతను ఇంటికి చేరుకున్నాడు. తక్షణం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్ట్‌ చేయించారు. బంధం కంటే పోలీసు బాధ్యత గొప్పదని భావించిన పోలీస్‌ అధికారికి వారు కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లాలోని ఓ పోలీస్‌ ఠాణాలో ఏఎస్సైగా పనిచేస్తున్నానని, తనపేరు, వివరాలు బహిర్గతం చేయవద్దంటూ ఆయన సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ అధికారులను అభ్యర్థించారు. ఏఎస్‌ఐకు ఇద్దరు కుమారులు ఈశ్వర్‌కుమార్‌, నాగరాజు. వీరు బెంగళూరులో కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేసేవారు. తొలుత నాగరాజు యాప్‌ రుణాల సంస్థలో చేరాడు. తర్వాత తన అన్న ఈశ్వర్‌కుమార్‌ను అందులోనే చేర్పించాడు. పోలీసులు నాగరాజును అరెస్టు చేయడంతో ఈశ్వర్‌కుమార్‌ సైతం లొంగిపోయినట్లు తెలిసింది.