AP Capitals: మూడు రాజధానులు మా విధానం.. సమయం చూసి బిల్లు పెడతామన్న మంత్రి బొత్స..

|

Mar 22, 2022 | 9:16 PM

రాజధాని వికేంద్రీకరణ వైసీపీ విధానమని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రజా సంక్షేమం దృష్ట్యా త్రి క్యాపిటల్ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల వివాదం ఇంకా చల్లారలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా..

AP Capitals: మూడు రాజధానులు మా విధానం.. సమయం చూసి బిల్లు పెడతామన్న మంత్రి బొత్స..
Botsa On Capital
Follow us on

రాజధాని వికేంద్రీకరణ వైసీపీ(YCP) విధానమని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa Satyanarayana). ప్రజా సంక్షేమం దృష్ట్యా త్రి క్యాపిటల్ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల వివాదం ఇంకా చల్లారలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా మూడు రాజధానులపై మంత్రులు స్పందిస్తూనే ఉన్నారు. తాజాగా పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాజధానుల అంశంపై స్పందించారు. 3 రాజధానులు బిల్లుపై మరోసారి బాంబ్ పేల్చారు మంత్రి బొత్స. త్రి క్యాపిటల్స్ తమ విధానమన్న బొత్స.. సమయం చూసి త్రి క్యాపిటల్ బిల్లు తీసుకొస్తామని కుండబద్దలు కొట్టారు. మ పార్టీ ఒకటే మాట చెబుతుందని తెలిపారు. రాష్ట్రసమగ్రాభివృధ్ధే సీఎం జగన్ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికీ వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు.

సమయం చూసుకుని అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పారు. స్మార్ట్‌ సిటీ మిషన్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన వారికి ఇంకా పెద్ద పదవి ఇస్తామేమో అని చెప్పారు మంత్రి బొత్స సత్యనారాయణ. అమరావతి విషయంలో హైకోర్టు కొద్దిరోజుల క్రితం కీలక తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. శాసన, కార్యనిర్వహక, న్యాయ వ్యవస్థలను వేర్వేరు ప్రాంతాలకు తరలిస్తూ శాసనం చేసే అధికారం అసెంబ్లీకి లేదని ధర్మాసనం తెలిపింది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని తెలిపింది.

హైకోర్టు తీర్పుపై అదేరోజు స్పందించిన బొత్స సత్యనారాయణ పరిపాలన వికేంద్రీకరణ తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉందన్నారు. రాజధాని అంటే భూములు, ఓ సామాజికవర్గం మాత్రమే కాదని.. రాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైనదిగా ఉండాలన్నారు. చంద్రబాబు మాదిరిగా వ్యక్తుల కోసం తమ ప్రభుత్వం కార్యక్రమాలు చేయబోదని.. వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపడతామని చెప్పారు. న్యాయ వ్యవస్థపై తమకు గౌరవం ఉందన్నారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌ను స‌మానంగా అభివృద్ధి చెందేలా చూడ‌ట‌మే త‌మ ప్ర‌భుత్వ ధ్వేయ‌మ‌ని బొత్స సత్యానారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత రాజ‌ధాని ఎక్క‌డ నిర్మించాల‌నే విష‌యంపై కేంద్రం నియ‌మించిన జ‌స్టిస్ శివ‌రామ‌కృష్ణ‌న్ క‌మిటీ కూడా పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌ను ప్ర‌స్తావించింద‌ని మంత్రి గుర్తుచేశారు. నాడు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ.. శివ‌రామ‌కృష్ణ‌న్ కమిటీ సిఫారుల‌ను ఎందుకు ప‌ట్టించుకోలేద‌ని బొత్స సత్యనారాయణ ప్ర‌శ్నించారు. త‌మ పార్టీ అధినేత ఆలోచ‌న‌లే త‌మ‌కు శిరోధార్యం అని చెప్పిన మంత్రి.. టీడీపీ నేత‌లు చెప్పిన మాట‌ల‌ను తాము పెద్ద‌గా ప‌ట్టించుకోబోమ‌ని తేల్చేశారు.

ఇవి కూడా చదవండి: Coconut Water: వేసవికాలంలో కొబ్బరి నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎంటో తెలుసా..

Axis Bank: ఎఫ్డీలపై వడ్డీ రేట్ల పెంపు.. కీలక నిర్ణయం తీసుకున్న మరో బ్యాంక్.. ఎంత పెరిగాయంటే..