Fire Accident: అహోబిలంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం..!

Fire Accident: ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న బీగల ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు..

Fire Accident: అహోబిలంలో భారీ అగ్ని ప్రమాదం.. రూ.50 లక్షలకుపైగా ఆస్తినష్టం..!
Fire Accident

Updated on: Oct 19, 2026 | 8:39 AM

Fire Accident: నంద్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆరు దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న బీగల ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో మూడు బొమ్మల దుకాణాలు, ఒక కూల్‌డ్రింక్స్ షాపు, రెండు హోటళ్లు పూర్తిగా కాలిపోయాయి.

ఈ అగ్నిప్రమాదంలో రూ.50 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు అంచనా వేస్తున్నారు. తమ దుకాణాల్లోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతి కావడంతో వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు, సమీపంలోని హోటళ్లలో ఉన్న గ్యాస్ సిలిండర్లను సకాలంలో బయటకు తరలించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు, నష్టం వివరాలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us