Andhra Pradesh: అసలే కొరత.. ఆపై ధరల మంట.. పెరిగిన రేట్లతో చేదెక్కిన మామిడి

|

May 18, 2022 | 7:46 PM

ఫల రాజుగా పేరొందిన మామిడి పండ్లంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. ముక్కలుగా కోసుకుని తినడం, జుర్రుకోవడం, జ్యూస్ చేసుకుని తాగడం, పచ్చి మామిడి ముక్కలపై ఉప్పు, కారం వేసుకుని...

Andhra Pradesh: అసలే కొరత.. ఆపై ధరల మంట.. పెరిగిన రేట్లతో చేదెక్కిన మామిడి
Mango
Follow us on

ఫల రాజుగా పేరొందిన మామిడి పండ్లంటే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. ముక్కలుగా కోసుకుని తినడం, జుర్రుకోవడం, జ్యూస్ చేసుకుని తాగడం, పచ్చి మామిడి ముక్కలపై ఉప్పు, కారం వేసుకుని లాగించడం ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఈ పండ్ల రుచిని ఆస్వాదిస్తుంటారు. వీటిని తినేందుకు సంవత్సరమంతా ఎదురు చూస్తుంటారు. వేసవి కాలంలోనే మామిడి పండ్లు లభిస్తాయి కాబట్టి అప్పటి వరకు వేచి చూడక తప్పదు. అలా ఆశించిన వారికి ఈ ఏడాది నిరాశ కలిగించింది. సరైన దిగుబడి లేకపోవడం, ఉత్పత్తి అంతంతమాత్రంగానే ఉండటంతో వీటి ధరలు కొండెక్కాయి. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కాయలు మొత్తం రాలిపోయాయి. దీంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు మామిడిని కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. 15 రోజుల కిందటి వరకు అందుబాటు ధరలకే లభించగా ప్రస్తుతం అమాంతం పెరిగాయి. సైజును బట్టి బంగనపల్లి బండ్లు బుట్ట ధర రూ.2 వేల వరకు పలుకుతోంది. చిన్న సైజు 50 కాయలు ఉన్న బుట్ట ధర రూ.1400 వరకు ఉంది. దీంతో సామాన్యులు వీటి రుచిని ఆస్వాదించే పరిస్థితి లేకుండా పోయింది.

అయితే.. విజయవాడ నగరంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి వరకు రాఘవేంద్ర థియేటర్, అజిత్‌ సింగ్‌నగర్‌, ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్‌ ప్రాంతాల్లో రైతులే నేరుగా విక్రయిస్తున్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే వారి వద్ద తక్కువ ధరకే పండ్లు లభిస్తున్నాయి. పచ్చడి మామిడి కాయలు సత్యనారాయణపురం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లే వంతెన వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాపారులు, రైతులు విక్రయిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇదీ చదవండి

Andhra Pradesh: జగన్ సర్కార్ అనూహ్యం నిర్ణయం.. ఆ జిల్లా పేరు మార్పు..