AP Rains: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. ఆ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్..

|

Nov 23, 2021 | 11:09 AM

రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీని ప్రభావం శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై..

AP Rains: దూసుకొస్తున్న మరో అల్పపీడనం.. ఆ సరిహద్దు గ్రామాల్లో అలర్ట్..
Ap Rains
Follow us on

కరువు కాటకాలతో ఆవాలమైన నేల.. తాగు నీటి కోసమే యుద్ధం చేయాల్సిన పల్లెలు.. నేడు వరదల సడిగుండంలో చిక్కుకుని రాయలసీమ అల్లాడిపోయింది. వారం రోజులు.. క్షణమొక యుగంలా గడిపింది. వరణుడికి బీపీ వచ్చి ఏపీని వణికించినట్టు.. గడగడలాడిపోయింది. ప్రస్తుతం వరణుడు శాంతించాడు.. కానీ వరద మిగిల్చిన బురద అలాగే ఉంది. ఆ బురదలోనే జనం నానిపోతున్నారు.. కన్నీరుమున్నీరవుతున్నారు. రికార్డ్‌ స్థాయిలో కురిసిన వర్షాలు, వరదల నుంచి ఇంకా తేరుకోకముందే  మరో ముప్పు ముంచుకొస్తోంది.

రానున్న 24 గంటల్లో దక్షిణ తూర్పు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుందని ప్రకటించింది వాతావరణ శాఖ. దీని ప్రభావం శ్రీలంక-దక్షిణ తమిళనాడుపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తోంది. బుధవారం నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ తమిళనాడు తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అయితే తమిళనాడుపై ఈ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అయితే చిత్తూరు, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో కూడా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచానావేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: 20 రూపాయల వాటర్ బాటిల్ కేఫ్‌లో 50 రూపాయలు.. 5 స్టార్ హోటల్‌లో 300 రూపాయలు ఎందుకు? కారణం తెలుసా..

Viral Video: ఈ క్యాప్ రంగులను గుర్తుపట్టగలరా.. సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతున్న కలర్ చూసింగ్..