Lover: తన విరహ వేదనను ఓ సెల్ఫీ వీడియో గా తీసి.. ఏంచేశాడంటే..!

|

Jul 09, 2021 | 10:06 PM

ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు అన్న పాత పాటలు వినే ఉంటాం.. కానీ ఇక్కడో కుర్రాడు.. ఏకంగా ప్రాణాలే కోల్పోయే పరిస్థితిలో పడ్డాడు...

Lover: తన విరహ వేదనను ఓ సెల్ఫీ వీడియో గా తీసి..  ఏంచేశాడంటే..!
Lover Attempt
Follow us on

Lover suicide attempt: ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు అన్న పాత పాటలు వినే ఉంటాం.. కానీ ఇక్కడో కుర్రాడు.. ఏకంగా ప్రాణాలే కోల్పోయే పరిస్థితిలో పడ్డాడు. ప్రాణాలు పొయ్యే ముందు తనదైన విరహ వేదనను ఓ సెల్ఫీ వీడియో గా తీశాడు. దాన్నలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా- మారెళ్ల గ్రామానికి చెందిన నాగభూషణం గత కొంత కాలంగా ఒకమ్మాయి ప్రేమలో ఉన్నాడు. కొన్నాళ్ల నుంచి వీళ్లిద్దరి మధ్య ఓ బిగ్ బ్రేకప్. బ్రేకప్ అంటే చెప్పేదేముందీ.. గుండెల నిండా బాధ నిండిపోతుంది.. అసలు సిసలు అర్జున్ రెడ్డిలాంటి వాళ్లనీ విరహ వేదన అంత తేలిగ్గా వదలదు. వెంటాడి వేధిస్తుంది. నాగభూషణం కూడా అటు ఇటుగా ఇలాంటి నయా దేవదాసే. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం అంటూ తీవ్ర మనోవేదన అనుభవించాడు.

ఒంగోలులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న కొడుకు లవ్ ఫెయిల్యూర్ గురించి ఊళ్లోని అతడి తల్లిదండ్రులకు కూడా తెలిసింది. అప్రమత్తమైన వాళ్లు.. ఇతడు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటాడేమో అన్న భయం కొద్ది.. ఓ ఇద్దరు యువకులను పురమాయించారు. తమ కొడుకుపై ఒక కన్నేసి ఉంచాలని సూచించారు. అయినా సరే నాగభూషణం వాళ్ల కన్నుగప్పి తప్పించుకున్నాడు. తన గది నుంచి పారి పోయి.. నగర శివారులో తేలాడు. కాసేపట్లో తాను చనిపోతున్నాననీ.. అందుకు తన లవ్ ఫెయిల్యూరే కారణమని ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేశాడు.

ఈ విషయం గుర్తించిన ఒక నెల్లూరు స్నేహితుడు ఒంగోలు పోలీసులకు సమాచారమందించాడు. నాగభూషణం ఫోన్ ను ట్రాక్ చేసిన సిఐ శ్రీనివాసరెడ్డి.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాడు. ఆ సరికే పురుగుల మందు తాగి పడి ఉన్న నాగభూషణాన్ని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం ఈ భగ్న ప్రేమికుడు కోలుకుంటున్నాడు. తమ కొడుకును ప్రాణాపాయం నుంచి తప్పించిన పోలీసులకు బాధితుడి తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పడంతో ఈ ట్రాజెడీ స్టోరీ హ్యాపీ ఎండింగ్ తీసుకుంది.

Read also: Jammu and Kashmir: కసరత్తు మొదలైంది : జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌ ప్రాసెస్‌ స్పీడప్ చేసిన కేంద్రం